జాతీయ వార్తలు

ఆ మూడు గంటలూ ఎక్కడ ఉంచారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్‌దాస్‌పూర్, జనవరి 7: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రవాద దాడిపై విచారణ జరుపుతున్న దర్యాప్తు బృందాలు ఎస్‌పి సల్వీందర్ సింగ్ వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించాయి. ఎయిర్‌బేస్ దాడికి ముందు ఉగ్రవాదులు తనను నిర్బంధించారని సింగ్ చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలోనూ విచారణ మొదలెట్టారు. గురుదాస్‌పూర్ ఎస్పీని ఉగ్రవాదులు ఎక్కడ నిర్బంధించారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఎస్‌పి నిర్బంధానికి గురయ్యాయని చెబుతున్న కొలియన్ గ్రామానికి బుధవారం దర్యాప్తు అధికారులు వెళ్లి పరిశీలించారు. డిసెంబర్ 31 రాత్రి గురుదాస్‌పూర్ ఎస్పీని నిర్బంధించి, ఆయన వంటవాడిని ఉగ్రవాదులు హత్య చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. సింగ్ స్నేహితులు రాకేష్‌వర్మను చిత్రహింసలకు గురిచేసిన మిలిటెంట్లు ప్రాణాలతో వదిలేశారు. దీనిపై వారు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. ఎయిర్‌బేస్‌పై దాడికి సంబంధించి ఎస్‌పి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. కాగా గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ ఆయన స్నేహితుడు రాకేష్ వర్మ చెబుతున్నవాటిలో దేనితోనూ అధికారులు సంతృప్తి చెందలేదు. ఆ రోజు ఓ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లామన్న వారి కథనాలను ఎన్‌ఐఏ విశ్వసించడంలేదు. ముఖ్యంగా తనను మూడు గంటల పాటు మిలిటెంట్లు నిర్బంధించారన్న ఎస్‌పి చెబుతున్నదానిలో నిజమెంతో తెలియాల్సి ఉందని ఓ సీనియర్ అధికారి అన్నారు. సల్వీందర్ సింగ్ వారం రోజుల క్రితమే గురుదాస్‌పూర్ జిల్లాకు బదిలీ అయ్యారు. పఠాన్‌కోట్‌కు పాతిక కిలోమీటర్ల దూరంలోని కొలియాన్ గ్రామంలో డిసెంబర్ 31 రాత్రి సాయుధులైన నలుగురు లేదా ఐదుగురు ఉగ్రవాదులు తనను, రాకేష్ వర్మ, వంటమనిషిని ఆపారని సింగ్ వెల్లడించారు.

ఉగ్రవాదుల నిర్బంధం నుంచి విడులయ్యాక పై అధికారులకు చెప్పినా సీరియస్‌గా తీసుకోలేదని ఎస్‌పి విచారణలో పేర్కొన్నారు.

పఠాన్‌కోట్ దాడి వెనుక మసూద్ అజర్, రవూఫ్ అజ్గర్