జాతీయ వార్తలు

ఇవిగో ఆధారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై దాడి చేసిన ఉగ్రవాదులకు మార్గనిర్దేశనం చేసిన నలుగు పాక్ ఉగ్రవాదులను భారత్ గుర్తించింది. జైషే మహ్మద్ అధినేత వౌలానా మసూద్ అజర్, ఆయన సోదరుడు అబ్దుర్ రవూఫ్ అజ్గర్‌తో సహా మొత్తం నలుగురు ఈ దాడికి సూత్రధారులని ఇంటెలిజెన్స్ విభాగం నిర్ధారించింది. వీరిలో అజ్జర్‌కు 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసి-814 హైజాక్‌తో సంబంధం ఉంది. ఈ నలుగురితోపాటు దాడి వెనుకవున్న కుట్రను అనేక కోణాల్లో ఛేదించి పలు కీలక వివరాలను వెలుగులోకి తెచ్చినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లాహోర్ సమీపంలోనే ఈ దాడికి కుట్ర జరిగినట్లు నిర్ధారించాయి.
ఈ నలుగురు ఉగ్రవాదుల వివరాలను పాక్ ప్రభుత్వానికి అందించామని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్‌ఖాన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకూ తాము సేకరించిన వివరాలను, స్వర నమూనాలను కూడా పాక్‌కు ఈ సందర్భంగా నివేదించినట్లుగా చెబుతున్నారు. అయితే కీలక వివరాలను పాక్‌కు అందించిన నేపథ్యంలో ఏ చర్య తీసుకోవాలని భారత్ కోరుతోందన్న ప్రశ్నకు ముందుగా ఈ నలుగురినీ అరెస్టు చేసి తమకు అప్పగించాలని, కేసు విచారణలో భాగంగా వారిని ప్రశ్నించడం సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.