జాతీయ వార్తలు

ముగిసిన కూంబింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, జనవరి 8: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేసిన ఆరు రోజుల తర్వాత ఈ సువిశాలమైన ఎయిర్‌బేస్‌లో భారీ ఎత్తున చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ శుక్రవారం ముగిసింది. అయితే రెండు రోజుల క్రితం సైనిక దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారని స్థానికులు చెప్పిన నేపథ్యంలో పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాలు ఇప్పటికీ హై అలర్ట్‌లోనే ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో కూంబింగ్ ఆపరేషన్ ముగిసిందని వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వేల ఎకరాల విస్తీర్ణం కలిగిన ఎయిర్‌బేస్‌ను అంగుళం కూడా వదలకుండా గాలించడం జరిగిందని ఆ అధికారి చెప్పారు. ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులను కాల్చి చంపిన తర్వాత గత మూడు రోజులుగా ఎయిర్‌బేస్‌ను క్షుణ్ణంగా గాలించే కార్యక్రమం సాగుతున్న విషయం తెలిసిందే. ఎయిర్‌బేస్‌లో ఇంకా ఉగ్రవాదులెవరు కూడా దాగి లేరని నిర్ధారించుకోవడం కోసం చేపట్టిన ఈ ఆపరేషన్‌ను సైన్యం, ఎన్‌ఎస్‌జి, భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండోలు సంయుక్తంగా చేపట్టారు.
కాగా, బుధవారం నాడు ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారని ఒక గ్రామంలోని స్థానికులు చెప్పిన నేపథ్యంలో పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాలు ఇప్పటికీ హై అలర్ట్‌లోనే ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ముఖ్యంగా టెర్రరిస్టులై ఉండవచ్చని భావిస్తున్న అనుమానిత వ్యక్తులు కనిపించినట్లుగా చెప్తున్న గురుదాస్‌పూర్‌లోని తిబ్రి కంటోనె్మంట్ ఏరియాలో సైన్యం, స్వాత్ కమాండోలతో పాటుగా పోలీసులు గాలింపు, కూంబింగ్ ఆపరేషన్లను కొనసాగిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పఠాన్‌కోట్‌లో, చుట్టుపక్కల గ్రామాలు, పట్ఠణాల్లో అన్ని వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేయడం జరుగుతోందని పఠాన్‌కోట్ ఎస్‌ఎస్‌పి ఆర్‌కె బక్షి చెప్పారు. తాము ఎలాంటి చాన్స్ తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల జాడ తెలుసుకోవడం కోసం సైన్యం డ్రోన్ హెలికాప్టర్లను ఉపయోగిస్తోందని, బులెట్ ప్రూఫ్ వాహనాలను రంగంలోకి దించిందని అధికారులు చెప్పారు. టెర్రరిస్టులను బైటికి రప్పించడం కోసం సైన్యం ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేసిందని, పోలీసులు ఇల్లిల్లూ తనిఖీ చేస్తున్నారని ఆ అధికారులు చెప్పారు. పంజాబ్ పోలీసులు స్వాత్ కమాండోలను రంగంలోకి దించారని, పోలీసు జాగిలాల బృందాలు కూడా గాలింపు చర్యల్లో సాయం అందిస్తున్నాయని ఆ అధికారులు తెలిపారు.