జాతీయ వార్తలు

దర్యాప్తును నీరుగార్చే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన దాడి ఘటనను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. దాడి సంఘటనపై విచారణ జరిపించి కుట్రదారులను శిక్షించే అంశంపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారు. భారత్ అందజేసే సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీంచిన తరువాతే ముందుకు సాగాలని షరీఫ్ ఇంటిలిజెన్స్ బ్యూరోను ఆదేశించడమే తాజా ఉదాహరణ. నవాజ్ షరీఫ్ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిపి భారత్ పంపించిన సాక్ష్యాలపై చర్చలు జరిపారు. సైనిక ఉన్నతాధికారులు, సివిల్ అధికారులు, ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు హాజరయ్యారు. పఠాన్‌కోట్ దాడికి సంబంధించి భారత్ పంపిన సాక్ష్యాలు ఎంత మాత్రం సరిపోవని సమావేశం అభిప్రాయపడిందని అంటున్నారు. మరిన్ని సాక్ష్యాలు పంపిస్తే తప్ప కుట్రదారులను గుర్తించి శిక్షించటం సాధ్యం కాదని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పాకిస్తాన్ సైన్యం, గూడచార సంస్థ ఐఎస్‌ఐ అధినాయకులు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల ద్వారా అఫ్గానిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయాలపై దాడుల పరంపరను కొనసాగిస్తున్నారు. మజారే షరీఫ్‌లోని భారత రాయబార కార్యాలయంపై రెండు రోజుల క్రితం దాడి చేసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు శుక్రవారం ఇరాట్‌లోని భారత కాన్సులేట్‌పై బాంబులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. కాన్సులేట్ కార్యాలయంలోకి బాంబులతో నింపిన కారును పోనివ్వడం ద్వారా దానిని పేల్చివేసేందుకు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రను అఫ్గాన్ పోలీసులు వమ్ము చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల క్రితం ఫోన్ చేసిన సందర్భంలో పఠాన్‌కోట్ కుట్రదారులపై చర్యలు తీసుకుంటామని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. కుట్ర పై దర్యాప్తుజరిపే బాధ్యతను ఇంటిలిజెన్స్ బ్యూరోకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడాయన మాట మార్చారు. భారత్ చూపుతున్న సాక్ష్యాలను పూర్తిగా విశ్వసించలేముకాబట్టి నిజానిజాలు నిర్ధారించుకున్న తరువాతే దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని పాక్ ప్రధాని కొత్తపల్లవి అందుకున్నారు. ఎయిర్‌బేస్ కుట్రదారులకు సంబంధించి భారత జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ పంపిన పది సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించిన దర్యాప్తు ప్రారంభించాలని షరీఫ్ అన్నట్టు తెలిసింది. తాము పంపిన సాక్ష్యాల ఆధారంగా వారం రోజుల్లో కుట్రదారులపై చర్యలు తీసుకోకపోతే ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉన్న విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం ఆగిపోవచ్చని భారత్ హెచ్చరించింది. అయితే భారత్ హెచ్చరికను పాకిస్తాన్ బేఖాతరు చేస్తున్నట్టు ఇస్లామాబాద్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌పై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై దర్యాప్తుజరిపి చర్య తీసుకునే ప్రసక్తే లేదని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రాహిల్ షరీష్ స్పష్టం చేయటంతో నవాజ్ షరీఫ్ నిస్సహాయుడైపోయాడని భారత ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతున్న పాకిస్తాన్ సైన్యం భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తొయిబా తదితర సంస్థలను పెంచి పోషించే విధానాన్ని అవలంబిస్తోంది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి కుట్రదారులపై దర్యాప్తు వేగవంతం చేయాలని అమెరికా చేసిన సూచనను రహిల్ షరీఫ్ పట్టించుకోవడం లేదు.