జాతీయ వార్తలు

జల్లికట్టు ఇక చట్టబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: తమిళనాట వివాదాస్పద జల్లికట్టు పోటీల నిర్వహణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆబోతుల (బలిష్ఠమైన ఎద్దుల)ను లొంగదీసుకునే ఈ క్రీడకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పొంగల్ (సంక్రాంతి) పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమిళనాట పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమయింది. జల్లికట్టు పోటీలను పునరుద్ధరించాలని అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తమిళనాడులోని వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విస్తృత డిమాండ్ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎడ్లబండ్ల పోటీలకు కూడా కేంద్రం ఈ నోటిఫికేషన్‌లో అనుమతించింది. జంతు హక్కుల సంఘాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ తమిళనాట జల్లికట్టు, ఇతర ప్రాంతాల్లో ఎడ్లబండ్ల పోటీలకు కేంద్రం అనుమతివ్వడం విశేషం. పొంగల్ వేడుకల్లో భాగంగా మత్తు పొంగల్ రోజున తమిళనాట జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. జల్లికట్టును ‘ఎరుతఝువుతల్’ అని కూడా పిలుస్తారు. పొంగల్ సమీపిస్తున్న తరుణంలో జల్లికట్టు పోటీలకు కేంద్రం అనుమతించడంలో తమిళనాట ముఖ్యంగా దక్షిణాది జిల్లాల్లో ప్రజలు టపాకాయలు పేల్చి, స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రం తన నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఎలుగుబంట్లు, కోతులు, పులులు, చిరుతపులులు, సింహాలు, ఎద్దులను ప్రదర్శించకూడదని, ప్రదర్శనకోసం వాటికి శిక్షణ ఇవ్వకూడదని పేర్కొంది. అయితే తమిళనాడులో జల్లికట్టు వంటి పోటీలలో ఎద్దులను ప్రదర్శించొచ్చని, అందుకోసం వాటికి శిక్షణ ఇవ్వొచ్చని కేంద్రం స్పష్టం చేసింది.
మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా, కేరళ, గుజరాత్ రాష్ట్రాలలో ఎవరైనా తమ సంప్రదాయం, ఆచారంలో భాగంగా ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించుకోవచ్చని వివరించింది. అయితే ఈ ఎడ్లబండ్ల పోటీలను రెండు కిలోమీటర్ల దూరానికి మించని సరయిన ట్రాక్‌లో నిర్వహించాలని కేంద్రం షరతు విధించింది. జల్లికట్టు విషయంలో 15 మీటర్లలోపు వ్యాసార్థం కల వృత్తాకార ప్రదేశంలోనే ఆబోతులు తిరగడానికి ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని, ఇందులో పాల్గొనే ఆబోతుల ఆరోగ్యం బాగుండాలని, ఇందుకు ఎనిమల్ హస్‌బండ్రీ అండ్ వెటరినరీ డిపార్ట్‌మెంట్ అధికారుల నుంచి ధ్రువీకరణ పొందాలని కేంద్రం షరతు పెట్టింది. ఆబోతులకు ఎలాంటి ఉత్ప్రేరకాలను ఇవ్వకూడదని స్పష్టం చేసింది.