జాతీయ వార్తలు

ఆర్మీ దుస్తులు ధరించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 8: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైనిక దుస్తులు పోలిన వాటిని ధరించడంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సైన్యాన్ని పోలిన దుస్తులు ధరించడాన్ని మానుకోవాలని, అలాగే ఈ తరహా దుస్తులను ఎవరూ ఎక్కడా అమ్మకూడదని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. సైనిక దుస్తులు ధరించి ఉగ్రవాదులు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి చొరబడ్డారన్న కథనాల నేపథ్యంలో తాజాగా వీటిని జారీచేశారు. సైనిక దుస్తులను ధరించినా, వాటిని విక్రయించినా చట్టవిరుద్ధమని, ఎవరూ ఈ రకమైన చర్యలకు పాల్పడకూడదని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే ప్రైవేటు గార్డులు, పోలీసులు, ఇతర కేంద్ర ప్రభుత్వ దళాలు కూడా ఆర్మీ దుస్తులు పోలిన వాటిని ధరించకూడదని, దీనివల్ల అనవసర భయాందోళనలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైనా సైనిక దుస్తులను విక్రయించాలనుకుంటే అందుకు సంబంధించి స్థానిక మిలటరీ అథారిటీని సంప్రదించాలని స్పష్టం చేశారు. సైన్యంతో సంబంధం లేని ఎవరికీ సైనిక దుస్తులను విక్రయించడం చట్టవిరుద్ధమని, అలాగే వీటిని ధరించడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గదర్శకాలను జారీచేసినట్లుగా తెలిపారు. అలాగే సైన్యంలో పనిచేసే వ్యక్తులు, మాజీ సైనికుల కుటుంబాలకు చెందినవారు కూడా వీటిని ధరించడానికి వీలు లేదని వెల్లడించారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సైనిక దుస్తులు దుర్వినియోగం జరగకుండా సామాజిక మీడియాలో విస్తృత ప్రచారం జరగాలని, మామూలు వ్యక్తులు వీటిని ధరించకూడదన్న స్పృహను బాగా కలిగించాలన్నారు.