జాతీయ వార్తలు

ఒడిశాలో పేలిన మందుపాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జనవరి 8: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పైబర్‌గూడ్ పోలీస్ పరిధి రామగిరి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శుక్రవారం మందుపాతర పేల్చిన ఘటనలో 143 బిఎస్‌ఎఫ్ బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్, మరో డిప్యూటీ కమాండర్ మృతి చెందగా, మరొక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
రామగిరి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు కోబ్రా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈనేపథ్యంలో పోలీసుల కదలికలను పసిగట్టిన మావోయిస్టులు అత్యంత శక్తివంతమైన మందుపాతరను పేల్చారు. ఈ పేలుడులో గాలింపు నిర్వహిస్తున్న జవాన్లలో కిబాసిస్ పాండా అనే జవాన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కమాండర్ సునీల్ బెహరాను హెలికాప్టర్‌లో కోరాపుట్ జిల్లా కేంద్రానికి తరలించగా, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే మరొక జవాన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బిఎస్‌ఎఫ్ పోలీసులు ఈ సంఘటన అనంతరం మావోయిస్టులపై దాడులు చేసేందుకు ప్రయత్నించగా మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ సంఘటనతో రామగిరి అటవీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటన జరిగిన పరిసర గ్రామాల గిరిజనులు భయంతో వణుకుతున్నారు.
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కొండబడి గ్రామానికి చెందిన బాపి సమంత్‌ను పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు శుక్రవారం దారుణంగా హత్య చేశారు. కొండబడి గ్రామంలోకి ప్రవేశించిన మావోయిస్టులు.. సమంత్‌ను అదుపులోకి తీసుకుని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి, ప్రజాకోర్టు నిర్వహించి గొడ్డలితో నరికి కిరాతకంగా హతమార్చారు.