జాతీయ వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో మత ఉద్రిక్తతలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 8: రాష్ట్రంలో ఎలాంటి మతపరమైన ఉద్రిక్తతలు లేవని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తమ పార్టీ అడ్డు కాదనీ, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు మళ్లీ చేపడతామని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కోర్ గ్రూప్‌ను ఏర్పాటుచేశామన్నారు. ‘త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయినా ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు. ఈ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుంది’ అని మమత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని, పరిశ్రమల ఏర్పాటుకు ఇది ఎంతో అవసరమని అన్నారు. ఇక్కడ జరుగుతున్న బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సులో ఆమె మాట్లాడుతూ బెంగాల్‌ను హింసాత్మక రాష్ట్రంగా చిత్రీకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బెంగాల్‌లో సమష్టిగా పనిచేసేందుకు అనువైన ప్రశాంత వాతావరణం ఉందన్నారు. ‘రాష్ట్రంలో ప్రశాంత జీవనాన్ని భగ్నం చేసే మతపరమైన ఉద్రిక్తతలు గానీ, అలాంటి ఘటనలు కానీ జరగలేదు. అలాంటి వాటిని ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించదు. రాజకీయంగా కొంతమంది విమర్శించినా పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం వుందని మాకు తెలుసు’ అని మమత స్పష్టం చేశారు. నక్సలైట్ల ప్రాబల్యం కలిగిన జంగల్‌మహల్‌లోనూ ప్రశాంతత నెలకొందని ఆమె గుర్తుచేశారు. మాల్దాలోని కాలియాచక్‌లో మత ఉద్రిక్తతలు చెలరేగడం, దీనిపై కేంద్ర హోంశాఖ నివేదిక కోరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగించేందుకు ప్రయత్నించిన ఆమె, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూమి అందుబాటులో ఉందని, అలాగే లాండ్ పాలసీతో పాటు లాండ్ బ్యాంక్ కూడా ఉందని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో పెట్టుబడులు జరగడం లేదని కొంతమంది విమర్శిస్తున్నారని, అది నిజం కాదని అన్నారు. 94వేల కోట్ల పెట్టుబడులకు జరిగిన ఒప్పందాల్లో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మమత వెల్లడించారు.
సదస్సుకు హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ తాము పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలాలు వచ్చే వాతావరణంపైనే పారిశ్రామికవేత్తలు దృష్టి పెడతారని అన్నారు. దాన్ని అందిపుచ్చుకునే పరిస్థితిలో లేకపోతే పెట్టుబడులను చేజార్చుకున్నట్టేనని జైట్లీ పేర్కొన్నారు.

చిత్రం,,, కోల్‌కతాలో శుక్రవారం జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయుష్ గోయల్‌తో ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

పార్లమెంటు
భద్రతపై సమీక్ష
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో పార్లమెంటుకు భద్రతపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంబంధిత సంస్థలతో సమీక్షించారు. 14 ఏళ్ల క్రితం పార్లమెంటు భవనంపై జరిగిన ఉగ్రదాడి తరువాత పూర్తి అప్రమత్తత పాటిస్తున్నారు. అయినప్పటికీ పఠాన్‌కోట్ ఘటన తరవాత భద్రతపై సమీక్షించాలని స్పీకర్ భావించారు. దీనిలో భాగంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం గంటసేపుభద్రతాధికారులతో సమావేశమయ్యారు.సిఆర్‌పిఎఫ్,్ఢల్లీ పోలీసు, పార్లమెంట్ భద్రతా విభాగం, ఇంటిలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారులతో స్పీకర్ భేటీ అయ్యారు. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరమని, భద్రత విస్తృతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్నందున భద్రతపై దృష్టిపెట్టాలని సుమిత్రా మహాజన్ ఆదేశించారు. అదనపుబలగాల మోహరింపుపై దృష్టి సారించాలని స్పీకర్ చెప్పారు.

ఫిబ్రవరి 2 నుంచి
జయ కేసు విచారణ
న్యూఢిల్లీ, జనవరి 8: అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసులో కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 2న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతోపాటు ముగ్గురిని కర్నాటక హైకోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చింది. దీనిపై కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌న విచారణకు స్వీకరించిన జస్టిస్ పిసి ఘోష్, జస్టిస్ అమిత్వారాయ్‌తో కూడిన ధర్మాసనం వచ్చేనెల 2 నుంచి విచారణ చేపడతామని ప్రకటించింది. ‘్ఫబ్రవరి 2న విచారం ప్రారంభించి 3, 4 తేదీల్లోనూ వాదనలు వింటాం అని‘ బెంచ్ తెలిపింది. దీనికి సంబంధించి ఇరుపక్షాల న్యాయవాదులు ప్రధాన అంశాలను రెండు వారాల్లో తమకు అందజేయాలని ఆదేశించింది. జయ కేసుపై రోజువారీ విచారణ చేపట్టాలన్న పిటిషనర్ అభ్యర్థనకు సానుకూలత వ్యక్తం చేసింది.
హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కర్నాటక చేసిన విజ్ఞప్తి మేరకు జూలై 27 సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బంధువులు విఎన్ సుధాకరన్, ఇలవరసిలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన వాదనను కూడా వినాలన్న బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి అభ్యర్థనను ధర్మాసనం మన్నించింది. కేసుకు సంబంధించిన ఆధారాలు అందజేయాలని పేర్కొంది. 18 ఏళ్లనాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత, మరో ముగ్గురికి ట్రయల్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2014లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్నాటక హైకోర్టు కొట్టివేసింది.