జాతీయ వార్తలు

మళ్లీ డీ‘ఢి’సిఏ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: కేంద్రానికి, ఢిల్లీ సర్కార్‌కు మధ్య మళ్లీ డిడిసిఎ వివాదం రాజుకుంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉన్నట్టుగా చెబుతున్న ఈ ఆర్థిక అవకతవకల వ్యవహారంపై ఢిల్లీ సర్కార్ వేసిన దర్యాప్తు కమిషన్‌ను ‘అక్రమం, రాజ్యాంగ విరుద్ధం’అంటూ కేంద్రం కొట్టివేసింది. దీనిపై విరుచుకు పడ్డ కేజీవాల్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దర్యాప్తును ఆపే ప్రసక్తి లేదని తెగేసి చెప్పింది. డిడిసిఎ వ్యవహారాలపై దర్యాప్తుకు ఆదేశిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఎలాంటి చట్టబద్ధతా లేదని కేంద్ర హోంశాఖ పేర్కొన్నట్టుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఓ లేఖలో స్పష్టం చేయడంతో వివాదం రగులుకుంది. చట్టం, రాజ్యాంగం ప్రకారమే దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేశామని..కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్ట విరుద్ధమని చెప్పినా తాము వెనక్కి వెళ్లేది లేదని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. దర్యాప్తు కమిషన్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే కోర్టును ఆశ్రయించాలని లెఫ్టినెంట్ గవర్నర్‌కు, కేంద్ర హోం శాఖకూ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డిడిసిఎ అవకతవకలపై దర్యాప్తు కమిషన్‌ను వేశామని, దీనిపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడాల్సిన అవసరం ఏమీ లేదని అన్నారు. కేవలం కోర్టు ద్వారా జారీ అయ్యే ఆదేశాలు మాత్రమే కమిషన్‌ను నిరోధించగలుగుతాయని కోల్‌కతాలో ఉన్న కేజ్రీవాల్ అనేక ట్వీట్‌లలో తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం ఎంత మాత్రం కేంద్రం చెప్పుచేతల్లో పని చేసేదేమీ కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా మీడియా సమావేశంలో అన్నారు. దర్యాప్తు కమిషన్ అక్రమమని కేంద్రం భావిస్తే కోర్టు ద్వారా దాన్ని రద్దు చేయాలని సూచించారు. డిడిసిఎ అవకతవకల్లో అరుణ్ జైట్లీని రక్షించేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని, కుంభకోణంలో ఆయన పాత్ర బయటికి రాకూడదన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం విరుచుకుపడింది.

చిత్రం... కోల్‌కతాలో శుక్రవారం జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ వేదికపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్