జాతీయ వార్తలు

బోనస్ కల నిజమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: అధిక బోనస్ అందుకోవాలన్న కార్మికుల కల వాస్తవరూపం దాల్చింది. దీనికి సంబంధించిన కొత్త బోనస్ చెల్లింపు చట్టంను ప్రభుత్వం ఈ నెల 1న గజెట్‌లో నోటిఫై చేసింది. దీంతో నెలకు 21 వేలకన్నా తక్కువ జీతం ఉన్న కోట్లాది మంది వేతన జీవులకు ప్రయోజనం చేకూరుతుంది. బోనస్ చెల్లింపు(సవరణ) బిల్లు 2015ను ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ చట్టం బోనస్ అర్హతను రూ. 10 వేల నుంచి 21 వేల రూపాయలకు పెంచడమే కాకుండా బోనస్‌ను లెక్క వేసే సీలింగ్‌ను ఇప్పుడున్న రూ. 3,500నుంచి రూ. 7 వేలకు లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉద్యోగానికి నిర్ణయించిన కనీస వేతనం ఏది ఎక్కువైతే దాని స్థాయికి పెంచింది. 2014 ఏప్రిల్ 1నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ‘2015నాటి బోనస్ చెల్లింపు(సవరణ) చట్టాన్ని 2016 జనవరి 1న భారత ప్రభుత్వ అసాధారణ గజెట్‌లో నోటిఫై చేయడమైనది’ అని శుక్రవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

సమాచార కమిషనర్లను
ఆర్నెల్లలో నియమించాలి

కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, జనవరి 8: సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(సిఐసి)లో చాలా కాలంగా ఖాళీగా మూడు సమాచార కమిషన్ పోస్టులను భర్తీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎలాంటి జాప్యం చేయకుండా ఆరువారాల్లోగా నియామకాలు చేపట్టాలని జస్టిస్ జెఎస్ ఖెహార్, జస్టిస్ సి నాగప్పతో కూడిన ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది. మూడు స్థానాల భర్తీపై ఇప్పటికే కేంద్రానికి సమయం కేటాయించామన్న ధర్మాసనం ఆరువారాల్లోగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. సమాచార కమిషన్ల నియామకానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నవంబర్ 6న హైకోర్టు తన తీర్పును వెలువరించింది. సమాచార కమిషనర్ల నియామకంలో పూర్తి పారదర్శకత పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కమిషనర్ల పోస్టులకు 553 దరఖాస్తులు అందాయి. వీటి నియామకానికి సంబంధించి రెండు సార్లు నోటిఫికేషన్లు జారీ చేయడమే తప్ప ఎలాంటీ పురోగతి లేదని, ఖాళీలను ఆరు వారాల్లోగా భర్తీ చేయాలని గతంలోనే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖను హైకోర్టుకు ఆదేశించింది. కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల కేసులు పెరిగిపోతున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఆర్‌టిఐ కార్యకర్తలు ఆర్ జైన్, లోకేష్ కె బాత్రా, సుభాష్ చంద్ర అగర్వాల్‌లు కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వారి తరఫున పిల్ వేశారు. కీలకమైన సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్, కమిషనర్ పోస్టుల నియామకానికి సంబంధించి స్పష్టమైన విధానం ఉండాలని ప్రశాంత భూషణ్ విజ్ఞప్తి చేశారు.