జాతీయ వార్తలు

దమ్ముంటే అయోధ్యలో మందిర నిర్మాణం చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 8: దమ్ముంటే అయోధ్యలో రామాలయం నిర్మాణం చేపట్టాలని ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాది పార్టీ బిజెపిని సవాలు చేసింది. అంతేకాదు వివాదాస్పద స్థలంలో ఒక్కరాయిని పెట్టడానికి కానీ, తొలగించడానికి కానీ రాష్ట్రప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేసింది. మరోవైపు దమ్ముంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభించాలని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు బిజెపిని సవాలు చేస్తూ, అలా చేస్తే తాను ఆ పార్టీకి పది లక్షల రూపాయలు, ఒక బంగారు కిరీటం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ‘ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బిజెపి మరోసారి రామ మందిరం సమస్యను లేవనెత్తుతోంది. మందిర నిర్మాణం ప్రారంభించాలని నేను వాళ్లను సవాలు చేస్తున్నాను. అలాచేస్తే నేను వారికి పది లక్షల రూపాయలు, ఒక బంగారు కిరీటం ఇస్తాను’ అని సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ శుక్రవారం పిటిఐతో అన్నారు. కాగా, రామందిర నిర్మాణం పేరుతో బిజెపి ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని సమాజ్‌వాది పార్టీ ప్రతినిధి, రాష్ట్ర మంత్రి శివ్‌పాల్ యాదవ్ అంటూ మందిర నిర్మాణం ఎక్కడ జరుపుతారో వాళ్లు చెప్పడం లేదన్నారు.
ఈ విషయంలో తమ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటుందని ఆయన చెప్పారు. ‘ఒక్క ఇటుకను తీయడం కానీ, పెట్టడం కానీ జరగనివ్వం’ అని ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు బిజెపి గోవధ అంశాన్ని లేవనెత్తుతోందని, అయితే ఆ పార్టీ మనుషులే గోవధకు పాల్పడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ బిజెపి వాళ్లు మందిర నిర్మాణం ప్రారంభమయ్యే తేదీలను ప్రకటించడంలో బిజీగా ఉన్నారని బుక్కల్ నవాబ్ అన్నారు. అయోధ్యలో మందిర నిర్మాణం జరగడం బిజెపి వాళ్లకే ఇష్టం లేదని, కేవలం ఈ అంశంపై రాజకీయాలు ఆడుతున్నారని కూడా ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లోగా అయోధ్యలో మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి రెండు రోజుల క్రితం చెప్పడం తెలిసిందే.