అంతర్జాతీయం

15నే భారత్-పాక్ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 9: భారత్‌తో విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ నానాతంటాలు పడుతోంది. ఇరు దేశాల మధ్య 15న విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరగాల్సి ఉందని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పేర్కొంది.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో కొద్దిరోజుల క్రితం భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి జరగడంతో ఈ చర్చలపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే భారత్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శులు 15న భేటీ కావాల్సిఉందని, సమగ్ర ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి కొత్తగా కుదిరిన అంగీకారం ప్రకారం ఇరు దేశాల మధ్య జరిగే వివిధ సమావేశాల టైమ్ షెడ్యూలును వీరు నిర్ణయిస్తారని పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ శుక్రవారం తమ దేశ పార్లమెంట్‌కు తెలిపారు. భారత్, పాక్ మధ్య జరిగే చర్చల్లో వివిధ అంశాలతోపాటు కాశ్మీరు అంశం కూడా ఉంటుందని అన్నారు.
భారత్, పాక్ చర్చల పరిస్థితి ఏమిటని తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అడిగిన ప్రశ్నకు అజీజ్ ఈ వివరణ ఇచ్చారు. పాకిస్తాన్‌తో కేవలం పిఓకె (పాక్ ఆక్రమిత కాశ్మీరు)కి సంబంధించిన అంశాల గురించి మాత్రమే చర్చిస్తామని భారత రాయబారి టిసిఎ.రాఘవన్ స్పష్టం చేసిన నేపథ్యంలో తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ ఈ ప్రశ్న అడిగింది. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడులకు సూత్రధారులుగా వ్యవహరించిన వారిపై నవాజ్ ప్రభుత్వం చేపట్టే ‘సత్వర, నిర్ణయాత్మక’ చర్యలపైనే విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల భవితవ్యం ఆధారపడి ఉంటుందని భారత్ స్పష్టంచేసి బంతిని పాక్ కోర్టులోకి నెట్టిన విషయం తెలిసిందే. దీంతో 15న ఇస్లామాబాద్‌లో జరగాల్సిన భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.