జాతీయ వార్తలు

రామాలయ నిర్మాణానికి బిజెపి నేత సుబ్రమణ్యస్వామి వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతు తెలుపుతానని మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తనకు హామీ ఇచ్చారని బిజెపి నాయకుడు సుబ్రమణ్య స్వామి వెల్లడించారు. కనుక ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి రామాలయ నిర్మాణానికి మద్దతు తెలపాలని ఆయన కోరారు. రామాలయ నిర్మాణ అంశంపై శనివారం ఢిల్లీ యూనివర్శిటీలో ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సును వ్యతిరేకిస్తూ ఆ యూనివర్శిటీ వెలుపల కొంత మంది ఆందోళనకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఈ ఆందోళనలను పట్టించుకోకుండా సదస్సులో సుబ్రమణ్యస్వామి తన ప్రారంభోపన్యాసాన్ని కొనసాగించారు. రామాలయాన్ని బలవంతంగానో లేక చట్టానికి వ్యతిరేకంగానో నిర్మించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రపంచంలోనే ఎంతో విశిష్టమైన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించేందుకు రామాలయాన్ని నిర్మించడం తప్పనిసరి. అయితే బలవంతంగానో లేక చట్టానికి విరుద్ధంగానో ఇది జరగదు. ఈ విషయమై న్యాయ పోరాటంలో విజయం సాధిస్తామన్న పూర్తి విశ్వాసం మాకు ఉంది’ అని ఆయన అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని స్వయంగా రాజీవ్ గాంధీయే తనతో చెప్పారని, అంతేకాకుండా అవకాశం వస్తే ఈ విషయంలో తన సహాయాన్ని కూడా అందజేస్తానని స్పష్టం చేశారని సుబ్రమణ్యస్వామి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకించినప్పటికీ రామాయణంపై టెలీ సీరియల్‌ను ప్రారంభించడం ద్వారా రాజీవ్ గాంధీ తన తొలి సహాయాన్ని అందజేశారని ఆయన అన్నారు. అయోధ్యలో రామాలయ శంకుస్థాపనకు సైతం అనుమతిస్తామని స్పష్టం చేసిన రాజీవ్ గాంధీ, దేశంలో రామరాజ్యం రావాలని 1989 ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న విషయాన్ని సుబ్రమణ్యస్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజీవ్ ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి రామాలయ నిర్మాణానికి మద్దతు తెలుపుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.