అంతర్జాతీయం

వాస్తవాల్ని వెలికితీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/ఇస్లామాబాద్, జనవరి 10: పఠాన్‌కోట్ దాడి వెనుక వాస్తవాలేమిటో తెలుసుకుని దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆదివారం పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కోరారు. కెర్రీ ఈ రోజు ఫోన్‌లో నవాజ్ షరీఫ్‌తో మాట్లాడారు. ‘ఇరువురు నేతలు తమ రెండు దేశాల సంబంధాలకు ముఖ్యమైన అంశాల గురించి చర్చించడమే కాకుండా ఈ ప్రాంతానికి సవాలుగా మారిన ఉగ్రవాదంపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ పిటిఐకి చెప్పారు. ఈ నెల 2న పంజాబ్‌లోని ఫఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై పాకిస్తానీ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు ఇవే కావడం గమనార్హం. కాగా పఠాన్ కోట్ ఉగ్రవాద ఆదాడిలో వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు జాన్ కెర్రీ పూర్తి మద్దతు తెలిపారని ఇస్లామామాద్‌లో పాక్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ‘తాము అత్యంత పారదర్శకమైన రీతిలో దర్యాప్తులు చేపట్టామని, వాస్తవాలను వెలుగులోకి తెస్తామని షరీఫ్ కెర్రీకి చెప్పారు. ఈ విషయంలో మా సమర్థతను, నిజాయితీని ప్రపంచం చూస్తుందని కూడా ప్రధాని చెప్పారు’ అని ఆ ప్రకటన తెలిపింది. మరింత సురక్షితమైన, అభివృద్ధి చెందిన దక్షిణాసియా ప్రాంతం కోసం భారత్, పాకిస్తాన్‌లు కలిసి పని చేయడం చాలా ముఖ్యమన్న తమ నమ్మకాన్ని కెర్రీ పునరుద్ఘాటించారని కూడా కిర్బీ చెప్పారు.
భారత్, పాకిస్తాన్ చర్చలను దెబ్బ తీయడానికి ఉగ్రవాదులు ప్రయత్నించినప్పటికీ ఈ చర్చలు కొనసాగాల్సిన అవసరం ఉందని కూడా కెర్రీ అభిప్రాయ పడ్డారు.