జాతీయ వార్తలు

ఏడోసారీ ఆయనే కారణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 10: కాశ్మీర్‌లో గవర్నర్ పాలనకు.. ముఫ్తీ మొహమ్మద్ సరుూద్‌కు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటివరకూ ఏడుసార్లు రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. అందుకు దారితీసిన అన్ని పరిస్థితుల వెనుకా ముఫ్తీదే కీలక పాత్ర! తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మరణమూ ఏడోసారి గవర్నర్ పాలనకు దారితీయడం విడ్డూరం. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపట్టాలన్న దానిపై పిడిపి-బిజెపిల మధ్య దూరం పెరగడంతో తాజాగా గవర్నర్ పాలన విధించారు. 1977 మార్చి 26న తొలిసారిగా కాశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. షేక్ మహ్మద్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి సరుూద్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో గవర్నర్ పాలన అనివార్యమైంది. 105 రోజుల పాటు కొనసాగింది. 1986లో రెండోసారి గవర్నర్ పాలన విధించడానికీ సరుూద్ సారథ్యంలోని కాంగ్రెసే కారణమైంది. అప్పట్లో గులామ్ మహ్మద్ షా ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించింది. మొత్తం 246 రోజుల పాటు కొనసాగింది. 1990లో ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించారు. అప్పట్లో ముఫ్తీ మహ్మద్ సరుూద్ కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. జగ్మోహన్ మల్హోత్రాను రాష్ట్ర గవర్నర్‌గా నియమించ వద్దంటూ ఫరూక్ అబ్దుల్లా చేసిన వాదనను ఆయన కొట్టిపడేశారు. ఆ పరిణామాల నేపథ్యంలో దాదాపు ఆరేళ్లపాటు అత్యంత సుదీర్ఘమైన రీతిలో గవర్నర్ పాలన కొనసాగింది. తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించడంతో 1996 అక్టోబర్‌లో గవర్నర్ పాలన ముగిసింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత అంటే 2002లో గవర్నర్ పాలన విధించారు. అందుకు కారణం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడమే. ఆ ఎన్నికల్లో సరుూద్ సారథ్యంలోని పిడిపికి 16 సీట్లు వచ్చాయి. ఆయన కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మూలంగా ప్రభుత్వం ఏర్పాటైంది. 2008లో గులామ్ నబీ ఆజాద్ సారథ్యంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును పిడిపి ఉపసంహరించుకోవడంతో మళ్లీ గవర్నర్ పాలన విధించారు. ఆ తర్వాత సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఉమ్మడిగా పోటీచేసి విజయం సాధించాయి. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి అనిశ్చితి ఏర్పడింది. ఫలితంగా 51 రోజులపాటు కేంద్ర పాలన అనివార్యమైంది. అనంతరం బిజెపి-పిడిపిలు తమ విభేదాలను పక్కనబెట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాయి. ఇప్పుడు సిఎం పదవిలో ఉండగానే సరుూద్ మరణంతో మళ్లీ రాజకీయ అనిశ్చితి.. అనివార్యంగా గవర్నర్ పాలన!

ముఫ్తీ మహ్మద్ సరుూద్ మృతిచెంది నాలుగు రోజులైన సందర్భంగా బిజ్‌బెహారాలో ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన పిడిపి మద్దతుదారులు