జాతీయ వార్తలు

కొత్త సమీకరణలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 10: కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్థం నెలకొన్న నేపథ్యంలో ఆదివారం కీలక ప్రాధాన్యత కలిగిన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బిజెపి నాయకుడు నితిన్ గడ్కరీ పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మరణానికి సంతాపం తెలిపేందుకే వీరిద్దరూ మెహబూబాను కలుహఉకున్నట్టు చెబుతున్నప్పటికీౄ దీని వెనుక కొత్త పొత్తుల ఎత్తుగడ ఉందా అన్న ఊహాగానాలకూ ఆస్కారం ఏర్పడింది. తమతో పొత్తును కొనసాగించే విషయంలో బిజెపికి కఠిన షరతులనే పిడిపి అధినేత్రి పెట్టారన్న మీడియా కథనాలు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేది లేదని, అలాగే కేంద్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా సహాయం కావాలని, సునిశిత అంశాలపై మాట్లాడకూడదంటూ మెహబూబా షరతులు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనితో ఆమె కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గుచూపుతారా లేక బిజెపితోనే కొనసాగుతారా అన్నదీ సందిగ్ధంగానే మారింది.
ముఫ్తీ మహమ్మద్ సరుూద్ మృతి పట్ల సంతాపం తెలియజేయడానికి సోనియా గాంధీ ఆదివారం పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని కలిశారు. ఢిల్లీనుంచి శ్రీనగర్ చేరుకున్న సోనియా నేరుగా కారులో మెహబూబా ముఫ్తీ నివాసం ఫెయిర్ వ్యూకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమెను కలిశారు. ఆమె దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ ఉన్నారు. సోనియా వెంట రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జిఎ మీర్, పార్టీ నాయకుడు సైఫుద్దీన్ సోజ్ కూడా ఉన్నారు.
ముఫ్తీ మృతి తర్వాత మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి పిడిపి మిత్రపక్షమైన బిజెపి ఇప్పటివరకు అధికారికంగా మద్దతు ప్రకటించని నేపథ్యంలో సోనియా, మెహబూబా సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పదవికి మెహబూబాకు మద్దతు ఇస్తున్నారని పేర్కొంటూ పిడిపి ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోరాకు ఒక లేఖ ఇచ్చింది. అయితే తన తండ్రి సంతాప దినాలు ముగిసేవరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోనని మెహబూబా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం ఏర్పాటుపై తమ వైఖరులను స్పష్టం చేయాలని గవర్నర్ వోరా గత శుక్రవారం బిజెపి, పిడిపిలను కోరారు. అయితే బిజెపి తన వైఖరిని స్పష్టం చేయకపోవడంతో గవర్నర్ శనివారం రాష్ట్రంలో గవర్నర్ పాలనను విధించడం తెలిసిందే.
chitram...

శ్రీనగర్‌లో ఆదివారం పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని కలిసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

శ్రీనగర్‌లో ఆదివారం పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీతో సమావేశమైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ