జాతీయ వార్తలు

ప్రపంచానికి ఆధ్యాత్మికతనే ఇచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 10: ప్రపంచానికి భారత్ ఆధ్యాత్మికతను అందజేసిందని, అంతేతప్ప మతోన్మాదాన్ని కాదని, మత గురువులు, సాధువులు ఎల్లప్పుడూ మానవాళి సంక్షేమం కోసమే కృషి చేస్తుంటారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రముఖ జైనమత గురువు ఆచార్య రత్నసుందర్‌సురిజీ మహరాజ్ రచించిన 300వ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరిస్తూ ఈ విషయాలను స్పష్టం చేశారు. భారత ఆధ్యాతిక వారసత్వాన్ని మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ ఎంతో బలంగా విశ్వసించేవారని, నేడు ఎదురవుతున్న సవాళ్లను మానవాళి అధిగమించేందుకు ఇది తప్పకుండా ఉపకరిస్తుందని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘్భరత్‌ను ప్రపంచం సరిగా అర్థం చేసుకోలేదు. భారత్ ఎన్నడూ వర్గ ధోరణులను అనుసరించలేదు. ప్రపంచానికి భారత్ ఆధ్యాత్మికతను అందించిందే తప్ప మతోన్మాదాన్ని కాదు. కొన్నిసార్లు మతం సమస్యలను సృష్టించవచ్చు. కానీ ఆ సమస్యలకు ఆధ్యాత్మికత పరిష్కారం చూపుతుంది’ అని ఆయన అన్నారు. ప్రపంచంలోని అన్ని రకాల భావనలు, దృక్కోణాలపై అనేక పుస్తకాల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన ఆచార్య రత్నసుందర్‌సురిజీ మహరాజ్‌ను గొప్ప సాంఘిక సంస్కర్తగా, ఆధ్యాత్మిక నాయకుడిగా ప్రధాని అభివర్ణించారు. రత్నసుందర్‌సురిజీ మహరాజ్ రచించిన ‘మై ఇండియా, నోబెల్ ఇండియా’ పుస్తకాన్ని పది రోజుల ఆధ్యాత్మిక సదస్సు ముగింపు సందర్భంగా ఆదివారం ఇక్కడి సియోన్ చునాబత్తి ఏరియాలోని సౌమ్య గార్డెన్స్‌లో జరిగిన సాహిత్య సత్కార్ సమరోహ్ కార్యక్రమంలో మోదీ ఆవిష్కరించారు. ఈ పుస్తకం నాలుగు (ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, మరాఠీ) భాషల్లో విడుదలైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దాదాపు 30 వేల మంది శ్రోతలను ఉద్ధేశించి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగిస్తూ, ‘ఇప్పుడు నేను మీకు చాలా దూరంలో ఉండొచ్చు. కానీ మీ హృదయాలకు చాలా చేరువలో ఉన్నాను. ఆచార్య రత్నసుందర్‌సురిజీకి వినమ్రంగా పాదాభివందనం చేస్తున్నాను’ అన్నారు.
chitram..
ఆచార్య రత్నసుందర్‌సురిజీ మహరాజ్ రచించిన పుస్తకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ఆవిష్కరించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ