జాతీయ వార్తలు

ఎందుకు పాటిస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: రుతుస్రావ వయసులో ఉన్న మహిళలను కేరళలోని చరిత్రాత్మక శబరిమల ఆలయంలోకి ప్రవేశించనీయకుండా నిషేధం విధించి ప్రాచీన కాలం నుంచి కొనసాగిస్తున్న సాంప్రదాయన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం ఇలా చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ‘మతం ప్రాతిపదికపై మినహా మహిళల ప్రవేశంపై ఆలయం నిషేధం విధించడానికి వీల్లేదు. రాజ్యాంగ పరంగా మీకేమైనా హక్కు ఉంటే తప్ప ఆలయ ప్రవేశంపై నిషేధించడం కుదరదు. ఏదిఏమైనప్పటికీ ఫిబ్రవరి 8వ తేదీన ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్‌వి.రమణతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ముట్లుడిగిన మహిళలను శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు అనుమతిస్తున్నప్పటికీ, రుతుస్రావ వయసులో ఉన్న బాలికలను అనుమతించకపోవడం తెలిసిందే. దీంతో వయసుతో నిమిత్తం లేకుండా బాలికలు, మహిళలందరికీ శబరిమల ఆలయంలో ప్రవేశం కల్పించాలని కోరుతూ యువ న్యాయవాదుల సంఘం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు స్వల్ప విచారణ జరిపి, శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించడం లేదని, రాజ్యాంగం సమర్ధించని ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారని నిలదీసింది. అంతేకాకుండా గత 1,500 ఏళ్లుగా శబరిమల ఆలయంలో మహిళలు ప్రవేశించడం లేదన్న విషయం నిజమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ ఆలయం అయినందున ప్రతి ఒక్కరికీ ప్రవేశ హక్కు కల్పించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.