అంతర్జాతీయం

కదిలిన పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 11: భారత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, దాడితో సంబంధం ఉందనే అనుమానంతో కొంతమందిని అరెస్టు చేసినట్లు నిఘా అధికారులు సోమవారం చెప్పారు. గుజ్న్‌వ్రాలా, జెలుం, బహవల్‌పూర్ జిల్లాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో కొంతమందిని అరెస్టు చేశారు. అయితే ఎంతమందిని అరెస్టు చేశారనేది తెలియరాలేదు. అరెస్టయిన వారు పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడినారా? లేక దాడి చేయడానికి సహకరించారా? అనేదాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు సాగుతోందని ఆ అధికారులు చెప్పారు. పఠాన్‌కోట్ దాడితో పాకిస్తాన్‌కు చెందిన వారికి సంబంధం ఉందా? అనే విషయాన్ని తేల్చడానికి దర్యాప్తు జరపాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ), మిలిటరీ ఇంటెలిజెన్స్, ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ, పోలీస్ శాఖల అధికారులతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. పఠాన్‌కోట్‌పై దాడి విషయంలో పారదర్శకంగా దర్యాప్తు జరుపుతామని, బాధ్యులు ఎవరినీ వదలిపెట్టబోమని షరీఫ్ ఇదివరకే ప్రకటించారు. వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఫోన్‌లో మాట్లాడిన పాకిస్థాన్‌లోని ఫోన్ నెంబర్లను, ఇతర సమాచారాన్ని భారత్ ఇదివరకే పాకిస్తాన్‌కు అందజేయడంతో పాటు దాడికి సహకరించిన, కుట్ర పన్నిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేసింది.