జాతీయ వార్తలు

జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 12: తమిళనాడులో జల్లికట్టును అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో జల్లికట్టు నిర్వహణకు వీలుగా ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసారు. జల్లికట్టు నిర్వహణకు వీలుగా ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సిందిగా తాను గత నెల 22నే మోదీని కోరిన ఆమె విషయాన్ని గుర్తు చేస్తూ ‘ఈ అంశాన్ని అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా జల్లికట్టు నిర్వహణకు వీలు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలన్న నా పూర్వ అభ్యర్థనను పునరుద్ఘాటిస్తున్నాను. దీనికి సంబంధించి తక్షణం చర్య తీసుకోవాలని తమిళనాడు ప్రజల తరఫున మిమ్మల్ని కోరుతున్నాను’ అని ఆమె మంగళవారం ప్రధానికి రాసిన ఒక లేఖలో కోరారు. జల్లికట్టు నిర్వహణకోసం కేంద్రం ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్లు కూడా పంపించడం జరిగిందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ నోటిఫికేషన్‌ను నిలిపివేసిందున రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు జల్లికట్టు నిర్వహణకోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని తెలిపారు.