జాతీయ వార్తలు

సొరంగంలో అవినీతి మేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: జోజిల్లా పాస్ సొరంగం నిర్మాణం కాంట్రాక్ట్‌ను తన సన్నిహితులకు చెందిన ఐఆర్‌బి సంస్థకు ఇప్పించిన కేంద్ర రోడ్లు, భవనాలు, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీపై దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. పదివేల కోట్ల రూపాయలకు సంబంధించిన జోజిల్లా సొరంగం నిర్మాణం ప్రాజెక్టు కోసం ఐఆర్‌బితోపాటు ఐఎల్‌ఎఫ్‌ఎస్, హెచ్‌సిసి, ఎల్ అండ్ టి వంటి ప్రముఖ కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసినా గడ్కరీ మాత్రం తన కుటుంబంతో సంబంధం ఉన్న ఐఆర్‌బి సంస్థకు ఇప్పించారని దిగ్విజయ్ సింగ్ ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఐఆర్‌బి సంస్థకు సొరంగాల నిర్మాణంలో ఎలాంటి అనుభవం లేకున్నా కాంట్రాక్టు ఇవ్వటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘అవినీతికి పాల్పడను, ఇతరులను పాల్పడనివ్వననే మీ హామీని నిలబెట్టుకోవలసిన తరుణం వచ్చింద’ని దిగ్విజయ్ సింగ్ ప్రధానికి సూచించారు. బిఓటి కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన అనంతరం దాదాపు ఇరవై రెండు సంవత్సరాలపాటు ఐఆర్‌బికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి 981 కోట్ల రూపాయలను ప్రభుత్వం యాన్యుటీ కింద చెల్లించవలసి ఉంటుందని ఆయన తెలిపారు. ఐఆర్‌బికి ఈ ప్రాజెక్టు లభించే విధంగా టెండర్ తయారు చేయించారనీ, ఇది సివిసి మార్గదర్శక సూత్రాలకు విరుద్ధమని దిగ్విజయ్ సింగ్ తన లేఖలో ఆరోపించారు. ఐఆర్‌బి అధినేత మైహిష్కర్ కుటుంబానికి గడ్కరీ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉందనీ, గడ్కరీ కుమారుడు నిఖిల్ గడ్కరీ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారనేది జగమెరిగిన సత్యమని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. గడ్కరీపై తాను చేసిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తికానంత వరకు ఐఆర్‌బి సంస్థకు 981 రూపాయల మొదటి కిస్తును నిలిపివేయాలని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు.