జాతీయ వార్తలు

చర్చలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసిన జైషే మహమ్మద్ అధినేత వౌలానా మసూద్ అజర్ అరెస్టును పాకిస్తాన్ ప్రభుత్వం ధ్రువీకరించకపోవటంతో శుక్రవారం జరగవలసిన రెండు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం రద్దు అయ్యింది. విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశాన్ని పరస్పర అంగీకారంతో వాయిదా వేసుకున్నట్లు రెండు దేశాల అధికార ప్రతినిధులు గురువారం ప్రకటించారు. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ గురువారం మధ్యాహ్నం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను పాక్ అరెస్టు చేసినట్లు తమకు ధ్రువపడలేదని తెలిపారు. మసూద్ అజర్ అరెస్టుకు సంబంధించిన సమాచారమేదీ తమ వద్దలేదని ఆయన చెప్పారు. అయితే ఎయిర్‌బేస్ దాడికి సంబంధించి పాకిస్తాన్ తీసుకున్న చర్యలను వికాస్ స్వరూప్ స్వాగతించారు. ఎయిర్ బేస్ దాడిపై దర్యాప్తు జరిపేందుకు పాక్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రాకకోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు.
రెండు దేశాల విదేశాంగ శాఖల కార్యదర్శులు గురువారం టెలిఫోన్‌లో చర్చలు జరిపిన అనంతరం కార్యదర్శుల సమావేశాన్ని వాయిదా వేసుకోవలనే నిర్ణయానికి వచ్చారని వికాస్ స్వరూప్ చెప్పారు. తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడే చెప్పటం సాధ్యం కాదన్నారు. రెండు దేశాలు అంగీకరించిన తరువాతనే సమావేశం తేదీలను ఖరారు చేస్తారని ఆయన వివరించారు. రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది తనకు తెలియదని ఒక ప్రశ్నకు బదులిస్తూ చెప్పారు. రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు తరచూ మాట్లాడుకుంటున్నారని వికాస్ స్వరూప్ చెప్పారు. వాయిదా పడిన విదేశాంగ శాఖల కార్యదర్శుల సమావేశం త్వరలోనే జరుగుతుందనే ఆశాభావాన్ని వికాస్ స్వరూప్ వ్యక్తం చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిపై పాక్ కొనసాగిస్తున్న దర్యాప్తు ప్రగతి సాధించిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎయిర్ బేస్‌పై జరిగిన దాడి గురించి దర్యాప్తు జరిపేందుకు పాక్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటాన్ని భారత్ పరిగణనలోకి తీసుకున్నదని స్వరూప్ చెప్పారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటం మొదటి సహేతుక చర్య అని ఆయన అభివర్ణించారు. మసూద్ అజర్‌ను అరెస్టు చేసినట్లు పాక్ ప్రకటించకపోతే రెండు దేశాల మధ్య చర్చలు జరగవా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. పాక్ ప్రభుత్వం దర్యాప్తును మరింత ముందుకు సాగించి నిందితులందరిని శిక్షిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కాగా,విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం మధ్యాహ్నం ప్రధాని మోదీని కలిసి శుక్రవారం జరగవలసిన రెండుదేశాల విదేశాంగ శాఖల కార్యదర్శుల సమావేశం గురించి చర్చించారు. పాక్‌నుంచి అందిన సమాచారాన్ని విశే్లషించటంతోపాటు మన నిఘా సంస్థలు తయారు చేసిన నివేదికలు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. జైషే మహమ్మద్ అధినాయకుడు వౌలానా మసూద్ అజర్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేయడానికి సంబంధించిన సమాచారంపై లోతుగా చర్చించిన అనంతరం విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని వాయిదా వేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే మోదీ ఆ తరువాత జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్‌తో విడిగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.