జాతీయ వార్తలు

సల్వీందర్ సింగ్‌పై ప్రశ్నల వర్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అంతకుముందు కిడ్నాప్ చేసి, వదలిపెట్టిన పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) స్థాయి అధికారి సల్వీందర్ సింగ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు వరుసగా నాలుగో రోజు గురువారం విచారించారు. సల్వీందర్ సింగ్ వంటమనిషి మదన్ గోపాల్‌ను, కిడ్నాప్‌కు గురికావడానికి ముందు సల్వీందర్ సింగ్ సందర్శించినట్లు చెబుతున్న ‘పంజ్ పీర్ దర్గా’ కేర్‌టేకర్ సోమ్‌రాజును కూడా ఎన్‌ఐఎ అధికారులు గురువారం విచారించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడితోపాటు అంతకుముందు అదే రాష్ట్రంలోని దీనానగర్‌లో ఒక పోలీసు స్టేషన్, ఇతర లక్ష్యాలపై ఉగ్రవాదులు జరిపిన దాడులకు మధ్య పోలికలు ఉన్నాయని కూడా ఎన్‌ఐఎ దర్యాప్తు అధికారులు కనుగొన్నారని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. పాకిస్తాన్ నుంచి చొరబడినట్లుగా భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులు ధరించి, భారీగా ఆయుధాలతో గత సంవత్సరం జూలై 27న దీనానగర్‌లో ఒక నడుస్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తరువాత ఒక పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ రెండు దాడుల్లోనూ కలిపి ఒక పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) సహా ఎనిమిది మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తరువాత ఆ ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఈ కేసును పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఎకు అప్పగించడానికి పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే పఠాన్‌కోట్‌పై దాడి కేసును ఎన్‌ఐఎ దర్యాప్తు చేస్తోంది.
తరచుగా మాట మారుస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్వీందర్ సింగ్‌ను ఎన్‌ఐఎ గురువారం కూడా విచారించడంతోపాటు ఆయన వంటమనిషిని, దర్గా కేర్‌టేకర్‌ను విచారించిందని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. వాస్తవాలను నిర్ధారించడానికి దర్యాప్తు అధికారులు వారు చెప్పిన విషయాలను పరస్పరం పోల్చి చూస్తున్నారని ఆ ప్రతినిధి వివరించారు. ‘పంజ్ పీర్ దర్గా’ బమియాల్ గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు ఈ గ్రామం మీదుగానే భారత భూభాగంలోకి ప్రవేశించారని భావిస్తున్నారు.