జాతీయ వార్తలు

ఇంధన పొదుపుతోనే భూతాపం అదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: భూగోళం వేడెక్కకుండా చూడాలంటే ఇంధన పొదుపు ఒక్కటే సరైన మార్గమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు చెప్పారు. మోదీ ఆదివారం ఆకాశవాణిలో పధ్నాల్గవ ‘మనసులోని మాట’ ప్రసంగం చేస్తూ ఈ విషయం చెప్పారు. వాతావరణం మారిపోతోంది, భూగోళం వేడెక్కిపోతోంది, దీనివలన మానవాళికి పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన హెచ్చరించారు. భూగోళం వేడెక్కటంపై పారిస్‌లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సమావేశానికి వెళ్లేముందు ఆయన ఈ అంశం గురించి ప్రస్తావించారు. భూగోళం వేడెక్కకుండా చూసేందుకు తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది, పలు పథకాలను అమలు చేస్తోందని మోదీ ప్రకటించారు. దీపావళి, క్రిస్మస్ పండుగల గురించి ప్రస్తావిస్తూ పం డుగలు మనలో ఉత్సాహం, శక్తిని నింపుతాయని ఆయన చెప్పారు. ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి కనీవినీ ఎరుగని వార్తలు వస్తున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశా రు. ఇటీవల తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కురిసిన భారీవర్షాల మూలంగా జరిగిన నష్టం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా మరణించినవారి కుటుంబాలకు మోదీ సానుభూతిని తెలిపారు. భూగోళం వేడెక్కిపోవటం వల్లనే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వ్యవహారం కేవలం వ్యవసాయ శాఖకు మాత్రమే పరిమితమయ్యేది, అయితే ఇప్పుడు అన్ని శాఖలు కలిసి పనిచేస్తే తప్ప దీనిని ఎదుర్కొనలేకపోతున్నామని అన్నారు. భూగోళం వేడిని తగ్గించేందుకు ప్రజలందరూ ఎల్‌ఇడి బల్పులను ఉపయోగించాలని ఆయన పి లుపిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని కా న్పూర్‌కు చెందిన నూర్జహాన్ సోలా ర్ లాంతర్ల ప్లాంట్ గురించి ప్రస్తావిస్తూ, వంద రూపాయలకు ఒకటి చొప్పున విక్రయిస్తున్న సోలార్ లాంతర్లను ఉపయోగించాలని ఆయన ప్రజలకు సూచించారు. పంజాబ్, హర్యానాలోని రైతులు కోత కోసిన అనంతరం మిగిలిపోయిన పంటను కాల్చివేయటం గురించి మాట్లాడుతూ, ఇలా చేసేబదులు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కోసి సేంద్రీయ ఎరువులుగా తయారు చేసుకోవాలని సూచించారు. మిగులు పంటను ఎలా ఉపయోగించుకోవచ్చుననే అంశంపై ఆయన పలు సలహాలిచ్చారు. ప్రధాన మంత్రి ముద్రా పథకం మూలంగా 24 లక్షల మంది మహిళలతోపాటు మొత్తం 66 లక్షల మందికి ప్రయోజనం కలిగిందని ప్రధాన మంత్రి వెల్లడించారు. వెనుకబడిన కులాలు, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన లబ్ధిదారులకు దాదాపు 42కోట్ల రూపాయలను అతితక్కువ సమయంలో అందజేయటం జరిగిందన్నారు. వీరంతా గౌరవప్రదమైన జీవితాలను గడపాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. ముద్ర ద్వారా చిన్న వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నాం, వారు ఆర్థికంగా సాధికారులయ్యేందుకు సహకరిస్తున్నామని ప్రధాని తెలిపారు. ముద్ర పథకాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలి, ఎక్కువ మంది దీనిద్వారా లా భం పొందేందుకు కృషిచేయాలని ఆయన బ్యాంకులకు సూచించారు. అంగవికలాంగుల పట్ల సున్నితత్వం తో వ్యవహరించాలన్నారు. వచ్చే నెల మూడో తేదీనాడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నేపథ్యంలో మోదీ ఈ సలహా ఇచ్చారు. అవయవ దానాలకు సంబంధించిన జాతీయ రిజిష్టరీని ఈ నెల 27న ఏర్పాటు చేసినట్లు మోదీ తెలిపారు. ఈ రిజిష్టరీ మూలంగా ఏ అవయవం ఎక్కడ లభిస్తుందనేది తెలుస్తుందన్నారు. దీనిమూలంగా ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు వీలు కలుగుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. అవయవ దానం చేసినవారు అమరులవుతారని ఆయన కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందజేస్తున్న ఆశా పనివారిని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఒడిశాలో మలేరియను నివారించేందుకు పోరాడుతున్న జమునా మనీ సింగ్ సేవలను ప్రధాని ప్రశంసించారు.

‘మనసులోని మాట’లో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ