జాతీయ వార్తలు

సునందది సహజమరణం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ భార్య సునందా పుష్కర్‌ది సహజ మరణం కాదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్.బస్సీ చెప్పారు. అయితే ఆమె శరీరంలో ఎలాంటి రేడియోధార్మిక పదార్థాల అవశేషాలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలలేదని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా ఆయన ఈ విషయం చెప్పారు. సునంద మృతికి విషప్రయోగం కారణం అయి ఉండవచ్చని ఎయిమ్స్ మెడికల్ బోర్డు అనుమానించడంతో ఢిల్లీ పోలీసులు ఆమె శరీరంలోని అవయవాలను గత సంవత్సరమే వాషింగ్టన్‌లోని ఎఫ్‌బిఐ ప్రయోగశాలకు పంపించారు. వాటిని పరీక్షించిన ఎఫ్‌బిఐ రెండు నెలల క్రితం ఢిల్లీ పోలీసులకు నివేదిక పంపించింది. సునంద శరీరంలోని అవయవాలలో రేడియోధార్మికత స్థాయి సురక్షితమైన స్థాయికి లోబడే ఉందని ఎఫ్‌బిఐ తన నివేదికలో తెలిపింది. దీనితో పాటు మరిన్ని అంశాలను వెల్లడించింది. ఎఫ్‌బిఐ నివేదిక ఆధారంగా సునంద మృతికి కారణాలను పోలీసులు రాబట్టలేకపోయారు. దీంతో ఈ నివేదికలోని అంశాలను విశే్లషించాలని ఢిల్లీ పోలీసులు ఎయిమ్స్ మెడికల్ బోర్డును కోరారు. ఎయిమ్స్ మెడికల్ బోర్డు పంపించిన 32 పేజీల నివేదికను పరీక్షించాల్సి ఉందని బస్సీ చెప్పారు. సునంద అనుమానాస్పద మృతి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో ఓ నిర్ధారణకు వస్తామని ఆయన తెలిపారు. ‘సునందది సహజ మరణం కాదనేది స్పష్టం. ఇప్పటి వరకు మేము చేసిన దర్యాప్తు, సేకరించిన ఆధారాల ప్రకారం ఆమెది అసహజ మరణం’ అని బస్సీ అన్నారు.
సిట్‌తో దర్యాప్తు చేయించాలి: స్వామి
జైపూర్: సునంద మృతి కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శనివారం జైపూర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. నిజానికి ఢిల్లీ పోలీసులే సిట్‌ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేయాల్సిందని ఆయన అన్నారు. ఎఫ్‌బిఐ నివేదికను బహిర్గతం చేయాలని ఆయన కోరారు.