జాతీయ వార్తలు

కట్టుబాట్లకు విరుద్ధంగా ఆలయంలో ప్రవేశించిన మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 29: మహారాష్టల్రో ఒక మహిళ పురాతన సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రముఖ దేవాలయంలో ప్రవేశించి పూజలు నిర్వహించింది. అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక కుగ్రామంలో గల షానీ పుణ్యక్షేత్రంలో ఆమె ఈ చర్యకు పాల్పడి ఆ దేవాలయంలో మహిళల ప్రవేశంపై ఎన్నో ఏళ్లనుంచి కొనసాగుతున్న నిషేధాన్ని ఉల్లంఘించింది. శనివారం బ్యారికేడ్‌ను దూకి ఆలయంలో ప్రవేశించిన ఆమె మూలవిరాట్టుకు పూజలు నిర్వహించింది. ఆ తర్వాత జనంలో కలసి అక్కడినుంచి అదృశ్యమైంది. దీనిపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం అక్కడ బంద్ పాటించారు. దీంతో ఆలయ కమిటీ రంగంలోకి దిగి ఏడుగురు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేయగా, గ్రామస్థులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి ఆలయాన్ని ‘శుద్ధి’ చేశారు. ఇదిలావుంటే, కొన్ని సామాజిక సంస్థలతోపాటు వివిధ వర్గాలు ఆ మహిళ చర్యను సమర్థిస్తున్నాయి. మహిళల ఆలయ ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎంతో ధైర్యంగా ఉల్లంఘించిన ఆమె అభినందనీయురాలని కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె, షోలాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణతి షిండే అన్నారు.
వచ్చే నెల నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు ప్రణతి చెప్పారు.