అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ వైద్యుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 17: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఒక సైకియాట్రిస్టును పోలీసులు అరెస్టు చేసారు. అతని వద్దకు వచ్చిన పేషెంట్లలో 36 మంది చనిపోవడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేసారు. వీరిలో 12 మంది మోతాదుకు మించి ఎక్కువ మందులు ప్రిస్క్రైబ్ చేయడం వల్ల చనిపోయారు. అవసరానికి మించి మందులు రాస్తున్నారన్న అనుమానంపై జార్జియా రాష్ట్రం లేటన్ కౌంటీలో ఉంటున్న నరేంద్ర నాగరెడ్డి అనే మానసిక వ్యాధుల నిపుణుడిని అరెస్టు చేసారు. దాదాపు 40 మంది ఫెడరల్, స్థానిక పోలీసు ఏజంట్లు నరేంద్ర ఆఫీసులపై దాడులు చేసి అనంతరం ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ఆయన నివాసంపైనా దాడి చేసారు. నరేంద్ర జోన్స్‌బోరోలో సైకియాట్రిస్టుగా పని చేస్తున్నాడని, చాలా సంవత్సరాలుగా ఆయన తన వద్దకు వచ్చే రోగులకు అవసరానికి మించి ఓపియోట్స్, బెంజోడయాజెపైన్‌లాంటి మత్తుమందులు ప్రిస్క్రైబ్ చేస్తున్నాడని, ఈ మందుల ఓవర్‌డోస్ కారణంగా చాలామంది చనిపోయారని క్లేటన్ కౌంటీ పోలీసు చీఫ్ మైక్ రిజిస్టర్ ఓ టీవీ న్యూస్ చానల్‌కు చెప్పారు. అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువైతే అతను ‘డాక్టర్ డెత్’ అనడంలో ఎలాంటి అనుమానం లేదని ఆయన చెప్పారు.
డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్, క్లేటన్ కౌంటీ అటార్నీ కార్యాలయం, క్లేటన్ కౌంటీ పోలీసు డిపార్ట్‌మెంటు, జార్జియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ సూపర్విజన్‌కు చెందిన ఎజంట్లు సెర్చ్‌వారంట్, అరెస్టు వారంట్‌తో గురువారంనాడు నరేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నరేంద్ర చికిత్స చేసిన పేషెంట్లలో 36 మంది చనిపోయారని, వారిలో 12 మంది మందుల మత్తు కారణంగా చనిపోయినట్లు శవపరీక్షల్లో నిర్ధారణ అయిందని లీగల్ డాక్యుమెంట్లలో పేర్కొన్నారు.