జాతీయ వార్తలు

పార్టీపగ్గాలు చేపడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. పార్టీ హైకమాండ్ నిర్ణయించిన వెంటనే అధ్యక్ష పదవి చేపడతానని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాహుల్ సోమవారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విలేఖరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని, అధినాయకత్వం ఈమేరకు నిర్ణయం తీసుకోవటమే ఆలస్యమని ప్రకటించారు. ఏఐసిసి పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరుగుతుందని వెల్లడించారు. కాంగ్రెస్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఏఐసిసి పునర్వ్యవస్థీకరణ చేపడుతుందన్నారు. తమ అవసరాల కోసం పార్టీ ఫిరాయించిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవటం జరగదని స్పష్టం చేశారు. నాయకుల మధ్య గొడవలు, ఇతర కారణాల మూలంగా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకోవచ్చుకానీ పదవుల కోసం పార్టీ ఫిరాయించిన వారిని మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు తాను పూర్తిగా వ్యతిరేకమని రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన మూడు సవరణలకు అంగీకరిస్తే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. దేశ ప్రజలకు నష్టం కలిగించే ప్రతిపాదనలను కాంగ్రెస్ ఎన్నటికీ ఆమోదించదన్నారు. పార్లమెంటులో గొడవ చేయటం మంచిది కాదంటూనే ఎన్డీయే ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక పథకాలను తప్పకుండా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం
ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని రాహుల్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం ఇచ్చే హామీలను అమలు చేయవలసిందేనని స్పష్టం చేశారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించేందుకు కాంగ్రెస్ పార్లమెంటు లోపల, బైట పోరాటం చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటులో చేసిన హామీలను కూడా ఆమలు చేయలేకపోతే ఎలా? అని రాహుల్ ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదని రాహుల్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ పూర్వవైభవాన్ని సునాయసంగా సాధించుకుంటుందంటూ, ఆంధ్రలోనే పార్టీ పరిస్థితి బాగాలేదని అంగీకరించారు. ఆంధ్రలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌కు నష్టం కలిగిన మాట వాస్తమే అయితే రాజకీయాల్లో ఇది మామూలేని ఆయన అభిప్రాయపడ్డారు.
టిఎంసితో పొత్తు ఉండదు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదని ఆయన వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటం సాధ్యం కాకపోవచ్చని, పార్టీ కార్యకర్తలు టిఎంసితో పొత్తుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదని చెప్పారు. బిహార్‌లో మాదిరి ఉత్తరప్రదేశ్‌లో మహా కూటమిని ఏర్పాటు చేయటం సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేశారు. తమిళనాడులో పార్టీని చేతులారా పాడుచేసుకున్నామనే అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు.