జాతీయ వార్తలు

దళిత విద్యార్థి ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె/గాంధీనగర్, జనవరి 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఓ దళిత పరిశోధకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పుణె, గాంధీనగర్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అలజడి రేకెత్తించింది. ఆందోళనకారులను ఈ ఆత్మహత్యను సంస్థాగత హత్యగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. హైదరాబాద్, ఢిల్లీ సహా అనేక పట్టణాల్లో రెండోరోజైన మంగళవారం కూడా నిరసనలు, ధర్నాలు కొనసాగాయి. పుణెలోని చలనచిత్ర టెలివిజన్ సంస్థ విద్యార్థులు మంగళవారం గేటు బయట బైఠాయింపు జరిపారు. హైదరాబాద్‌లో ఉద్యమిస్తున్న విద్యార్థులు సంఘీభావంగానే ఫిలిం ఇన్‌స్టిట్యూట్ ముందు తాము రోజంతా నిరశన జరిపినట్లు వెల్లడించారు. అలాగే చెన్నైలో కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపారు. అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్న శాస్ర్తీ భవన్ వద్ద పికెటింగ్ నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు 65మంది కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లో సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 50మంది దళిత విద్యార్థులు నిరసన ప్రదర్శన జరిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ తీసుకున్న కఠిన చర్య కారణంగానే పరిశోధన విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైందని ఆరోపించారు. ఈ ఆత్మహత్యను సంస్థాగత హత్యగా అభివర్ణించిన విద్యార్థులు ఈ మొత్తం వ్యవహారంపై స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. పంజాబ్‌లోని అంబేద్కర్ సేన కార్యకర్తలు పగ్వారా ప్రాంతంలో నిరసన ప్రదర్శన జరిపి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
దళితులకు అన్యాయం: మాయావతి
నాటి యుపిఏ, నేటి ఎన్‌డిఏ దళితులకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతోందని బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ దళితుల సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. కోల్‌కతాలో ఓ కార్మిక ర్యాలీలో మాట్లాడిన మాయావతి సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని, వారి సాధక బాధకాలు తెలుసుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి ఆత్మహత్య దేశవ్యాప్తంగా అలజడి రేకెత్తిస్తోంది. మంగళవారంనాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎఐఎస్‌ఐ విద్యార్థులు, నాగపూర్‌లో పలు విద్యార్థి సంఘాల సభ్యులు ఆందోళనలు చేపట్టారు. ముంబయలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఎన్‌సిపి కార్యకర్తలు

ఇక ‘అమ్మ’ కాల్‌సెంటర్లు

అన్నివేళలా టోల్‌ఫ్రీ నెంబర్

చెన్నై, జనవరి 19: ‘అమ్మ’ టిఫిన్ సెంటర్లు, ‘అమ్మ’ భోజన కేంద్రాలకు ఇప్పటివరకు అలవాటుపడ్డ తమిళనాడు ప్రజలకు ‘అమ్మ’ కాల్‌సెంటర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ‘అమ్మ’ కాల్‌సెంటర్ల కార్యక్రమాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం నాడిక్కడ ప్రారంభించారు. తమిళ ప్రజలు జయలలితను ఆప్యాయంగా ‘అమ్మ’ అని సంబోధిస్తారు కాబట్టి ఆ పేరుతోనే ఇప్పటివరకు అనేక కార్యక్రమాలను చేపట్టారు. వీటన్నింటిలోనూ ‘అమ్మ’ క్యాంటిన్లు ప్రజలకు సబ్సిడీపై భోజనాన్ని అందిస్తూ ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. అలాగే ‘అమ్మ’ మినరల్ వాటర్ కూడా అంతే ఆదరణ పొందింది. ఇప్పుడు ‘అమ్మ’ కాల్‌సెంటర్లను ప్రారంభించడం ద్వారా టోల్‌ఫ్రీ నెంబర్‌తో రాష్ట్రంలో ఎక్కడినుంచైనా ఏ సమయంలోనైనా ప్రజలు తమ ఇబ్బందులను తెలియజేసే అవకాశాన్ని జయ కల్పించారు.