జాతీయ వార్తలు

ఘనం.. గణతంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సర్వతోముఖ వికాసం కళ్లకు కట్టింది. సాంస్కృతిక వైభవం, సైనిక పాటవం, ఆర్థిక ప్రగతి విభ్ని కోణాల్లో ఆవిష్కతమయ్యాయి. 67వ గణతంత్ర వేడుకలు
అనేక రకాలుగా ప్రత్యేకం. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాన్ ముఖ్య అతిధి అయ్యారు. ఆ దేశ సైనికులూ కవాతులో తొలి సారిగా పాల్గొన్నారు. జాగిలాల సైన్యమూ అలరించింది.
జాతీయ స్థాయిలో భారతీయ వైభవం కనువిందు చేస్తే..సమాఖ్య స్ఫూర్తికి అద్దం పడుతూ అన్ని రాష్ట్రాల్లోనూ ఘనంగా గణతంత్రం జరిగింది. ఇరవై తొమ్మిది రాష్ట్రాలూ
తమ ప్రగతిని విభిన్న రూపాల్లో ఆవిష్కరిస్తూ అద్భుత శకటాలనూ రాజ్‌పథ్‌లో ప్రదర్శించాయి. ఆసేతు హిమాచలం అబ్బురపడేలా సాగిన గణతంత్ర వేడుకలు
భారతావని భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తికి.. సార్వభౌమత్వ పరిరక్షణలో తిరుగులేని సాధన సంపత్తికి నిలువెత్తు నిదర్శనమే అయ్యాయి.

గణతంత్ర దినోత్సవాన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్టప్రతి ప్రణబ్. ముఖ్యఅతిథి హోలాన్, మోదీ

సైనిక కవాతులో మిలటరీ శునకాల మార్చ్‌పాస్ట్

రాజ్‌పథ్‌లో నిర్వహించిన 67వ
గణతంత్ర వేడుకల ప్రత్యేకంగా సైనిక
కవాతులో పాల్గొన్న ఫ్రాన్స్ మిలటరీ

లాన్స్ నాయక్ మోహన్‌నాథ్ గోస్వామి భార్య భావనా గోస్వామికి శౌర్యచ్రక పతకాన్ని అందిస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ