జాతీయ వార్తలు

మువ్వనెన్నల రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: దేశ వ్యాప్తంగా రిపబ్లిక్‌డే వేడుకలు అంబరాన్నంటాయి. అన్ని రాష్ట్రాల్లోనూ గణతంత్ర దినోత్సవ సంబరాలు వెల్లివిరిశాయి. ఆయా ప్రాంతాల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 67వ రిపబ్లిక్‌డే సందర్భంగా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రాల రాజధానుల్లో గవర్నర్లు మువ్వనె్నల జెండా ఎగరేశారు. జమ్మూలోని ఎంఏ స్టేడియంలో జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో కాశ్మీర్ డిప్యూటీ కమిషనర్ అస్ఘర్ సమూన్ సైనిక వందన స్వీకరించారు. ఎముకలు కొరికే చలిలోనూ కాశ్మీర్ లోయ తదితర జిల్లాల్లో ప్రజలు పెద్దఎత్తున గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే వేర్పాటువాద సంస్థలు బ్లాక్‌డేకు పిలుపునిచ్చినా, రిపబ్లిక్‌డే సెలవుకావడంతో దుకాణాలు మూతపడే ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలోని శివాజీపార్కులో గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీమైదాన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రంలో మతసామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతున్నట్టు చెప్పారు. అవినీతి రహిత బీహార్‌కోసం అనేక చర్యలు తీసుకున్నట్టు గవర్నర్ స్పష్టం చేశారు. చండీగఢ్‌లో గవర్నర్ సింగ్ సోలంకీ, కోల్‌కతాలో గవర్నర్ కెఎన్ త్రిపాఠి జాతీయ పతాకాలను ఎగరేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వేడుకగా గణతంత్ర దినోత్సవం జరిగింది.

చిత్రం... చిన్నతనంలోనే తప్పిపోయ పాకిస్తాన్ వెళ్లి ఇటీవలే భారత్‌కు తిరిగివచ్చిన గీత ఇండోర్‌లో జరిగిన రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దృశ్యం

జాగిలాల
రాజసం
న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజ్‌పథ్‌లో జరిగిన కవాతులో 36 సైనిక జాగిలాలు తమ రాజసాన్ని ఒలకబోశాయి. సైనిక జాగిలాలు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడం 26 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ప్రస్తుతం పరేడ్‌లో పాల్గొన్న సైనిక శునకాల్లో 24 లాబ్రాడర్లు, మరో 12 జర్మన్ షెపర్డ్‌లు ఉన్నాయి. సైనిక దళంలో విశేష సేవలు అందిస్తున్న దాదాపు 1,200 జాగిలాల నుంచి వీటిని ప్రత్యేకంగా ఎంపికచేసి పేలుడు పదార్థాలు, మందుపాతరలను గుర్తించడం, నేరస్థుల ఆచూకీ కనుగొనడం, పహారా విధులు నిర్వర్తించడంలో నాలుగు నెలల పాటు అత్యంత కఠోర శిక్షణ ఇచ్చారు. ముదురు ఎరుపు, పసిడి వర్ణాలతో కూడిన వస్త్రాలను ధరించి రాజసం ఉట్టిపడేలా కవాతు నిర్వహించిన ఈ శునకాలు చూపరులను ఔరా అనిపించాయి. ప్రస్తుతం భారత సైనిక దళంలో ప్రధానంగా నాలుగు జాతులకు చెందిన శనకాలు విశేష సేవలను అందిస్తున్నాయి. వీటిలో లాబ్రాడర్, జర్మన్ షెపర్డ్ జాతులకు చెందిన శనకాలతో పాటు బెల్జియం మిల్లినోయిస్, గ్రేట్ వౌంటెన్ స్విస్ జాతులకు చెందిన శునకాలు ఉన్నాయి.

ఇవీ.. ‘తొలిసారి’
న్యూఢిల్లీ, జనవరి 26: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్నాయి. పరేడ్ సమయాన్ని కుదించడం, విదేశీ సైనిక దళం మార్చ్ఫాస్ట్‌లో పాలుపంచుకోవడంతో పాటు మాజీ సైనికుల శకటం కొలువుదీరడం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతల్లో కొన్ని. రాజ్‌పథ్‌లో జరిగిన పరేడ్‌లో తొలిసారిగా ఫ్రాన్స్ సైనిక దళం పాల్గొని తొలి విదేశీ సైనిక దళంగా చరిత్ర సృష్టించింది. ఫ్రాన్స్‌లో ల్యోన్‌కు చెందిన 48మంది సైనికులతో కూడిన ‘ద మ్యూజిక్ ఆఫ్ ది ఇన్‌ఫాంట్రీ’ బృందం మార్చ్ఫాస్ట్‌లో పాల్గొంది. వేడుకల్లో ఫ్రాన్స్ సైనిక బ్యాండ్ ప్రతిభకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రతిసారీ రెండు గంటలకు పైగా సాగే పరేడ్ తొలిసారి 90 నిమిషాల్లోనే ముగిసింది. మిగిలిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగాయి. అలాగే, పరేడ్‌లో తొలిసారిగా మాజీ సైనికుల శకటం కొలువుదీరింది. జాతి నిర్మాణంలో తమ పాత్రను వారు ఈ సందర్భంగా దేశానికి చాటారు. ఇప్పటివరకు పురుషులు మాత్రమే దర్శనమిచ్చే సిఆర్‌పిఎఫ్ దళం ఈసారి ఆ సంప్రదాయానికి స్వస్తి పలికింది. పూర్తిగా మహిళలతో కూడిన దళం తొలిసారిగా పరేడ్‌లో పాల్గొని సిఆర్‌పిఎఫ్ చరిత్ర సృష్టించింది. అలాగే, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశ రాజధాని ఢిల్లీలోని పది కీలక ప్రాంతాల్లో లైట్ మెషీన్ గన్‌లను ఏర్పాటుచేశారు.

కానరాని అణు క్షిపణులు
న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వరుసగా మూడోసారి అణు క్షిపణులను ప్రదర్శించలేదు. 2013 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బాలిస్టిక్ క్షిపణి అగ్నిని ప్రదర్శించారు. అప్పటి వేడుకలకు ముఖ్య అతిథిగా భూటాన్ రాజు జిగ్మే వాంగ్‌చుక్ హాజరయ్యారు. గణతంత్ర వేడుకల్లో అణు క్షిపణిని ప్రదర్శించడం అదే చివరిసారి. 2014లో జరిగిన గణతంత్ర వేడుకల్లోనూ బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించలేదు. ఆ ఏడాది ముఖ్య అతిథిగా జపాన్ ప్రధాని షింజో అబె హాజరయ్యారు. ఆ సమయంలో జపాన్‌తో భారత్ పౌర అణు ఒప్పందంపై సంప్రదింపులు జరుపుతోంది. ఇక 2015 విషయానికొస్తే, ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. అప్పుడు కూడా బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించకపోవడం గమనార్హం. ఎంతో వైభవంగా జరిగే గణతంత్ర పరేడ్‌లో అణు క్షిపణులను ఎందుకు ప్రదర్శించడం లేదు? ఇదే ప్రశ్నను ఢిల్లీ ప్రాంతానికి చెందిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్ట్ఫా మేజర్ జనరల్ రాజేష్ సహాయ్‌ను ఇటీవల విలేఖరులు ప్రశ్నించగా, రక్షణ రంగానికి చెందిన అన్ని వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో అన్ని సమయాల్లోనూ ప్రదర్శించలేమని బదులిచ్చారు. వచ్చే ఏడాది జరిగే వేడుకల్లో రొటేషన్ ప్రాతిపదికన కొన్నింటిని ప్రదర్శించే అవకాశముందని వెల్లడించారు.

కనువిందు చేసిన
23 శకటాలు
న్యూఢిల్లీ, జనవరి 26: గిర్ అడవుల్లోని అరుదైన ఆసియా సింహాలు, మధ్యప్రదేశ్ తెల్లపులుల సఫారీ, రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ రచనలు, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్భారత్, డిజిటల్ ఇండియా వంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకుని ఈ ఏడాది గణతంత్ర దిన వేడుకల్లో ప్రదర్శించిన శకటాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన పరేడ్‌లో మొత్తం 23 శకటాలను ప్రదర్శించారు. వీటిలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు ఉన్నాయి. అలాగే కేంద్ర సాంఘిక న్యాయ, సాధికారత, పునరుత్పాదక ఇంధన వనరులు, తాగునీరు, శానిటేషన్, కమ్యూనికేషన్లు, ఐటి, పంచాయతీరాజ్ శాఖలతో పాటు ఎన్నికల కమిషన్‌కు చెందిన మరో ఆరు శకటాలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. అస్సాం, గోవా, సిక్కిం, రాజస్థాన్, చండీగఢ్, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఈ ఏడాది రాజ్‌పథ్‌లో తమ శకటాలను ప్రదర్శించాయి.
అయితే ఈ పరేడ్‌లో ఢిల్లీ వరుసగా మూడో ఏడాది కూడా తమ శకటాన్ని ప్రదర్శించలేదు.

జైపూర్ అందాలతో కనువిందు
చేసిన రాజస్థాన్ శకటం

ఆకట్టుకున్న స్వచ్ఛ్భారత్
డిజిటల్ ఇండియా
న్యూఢిల్లీ, జనవరి 26: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలను శకటాల రూపంలో ప్రదర్శించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజ్‌పథ్‌లో జరిగిన పరేడ్‌లో స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ తదితర కార్యక్రమాలను ఇతివృత్తంగా చేసుకుని మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణతంత్ర దినోత్సవ కవాతును ఈసారి 90 నిమిషాలకు కుదించినప్పటికీ సౌర, పవన విద్యుత్‌కు సంబంధించిన ‘నమామి గాంగే’, డిజిటల్ ఇండియా వంటి మెగా పథకాలపై కేంద్రం ప్రదర్శించిన శకటాలు ఎంతో కనువిందు చేశాయి. అలాగే రాత్రివేళ సైతం సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నట్లు చూపుతూ ‘మెగావాట్ నుంచి గిగావాట్’ అనే ఇతివృత్తంతో పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ ప్రదర్శించిన శకటం, స్వచ్ఛ భారత్‌ను ఇతివృత్తంగా తీసుకుని తాగునీరు, శానిటేషన్ శాఖ ప్రదర్శించిన శకటం చూపరులను విశేషంగా అలరించాయి. శుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న కార్యాచరణను ఆ శాఖ ఈ శకటం ద్వారా వివరించింది. అలాగే ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఐటి, కమ్యూనికేషన్ల శాఖ ప్రదర్శించిన శకటం కూడా ఈ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో డిజిటల్ సేవల ఆవశ్యకతను వివరిస్తూ ముందు భాగాన్ని ప్రింటర్ రూపంలో, కింది భాగాన్ని కంప్యూటర్ వౌస్ రూపంలో డిజైన్ చేసిన ఈ శకటాన్ని మొబైల్ ఫోను, ట్యాబ్లెట్, యుఎస్‌బి డ్రైవ్, చిప్స్ వంటి గాడ్జెట్లతో తీర్చిదిద్దారు.

‘డిజిటల్ ఇండియా’

మాజీ సైనికులు