జాతీయ వార్తలు

రోమాంచిత విన్యాసాలతో అలరించిన ‘డేర్ డెవిల్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ‘డేర్ డెవిల్స్’ మోటార్ సైకిల్ బృందం తమ అద్భుత ప్రదర్శనలతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఒళ్లు గగుర్పొడిచే విధంగా వివిధ రకాల స్టంట్లతో మంగళవారం రాజ్‌పథ్‌లో వీరు ప్రదర్శించిన రోమాంచిత విన్యాసాలను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర అతిథులతో పాటు ఆహూతులంతా ఊపిరి బిగబట్టి వీక్షించారు. ‘డేర్ డెవిల్స్’ ప్రదర్శించిన అనేక విన్యాసాలు మరోసారి ఈ వేడుకల్లో హైలెట్‌గా నిలిచాయి. వీటిలో ప్రధానంగా ‘శాల్యూట్ టు ప్రెసిడెంట్’, ‘సిగ్నల్ రాకెట్’, ‘సిగ్నల్ ఫైటర్’, ‘అభిమన్యు’, ‘శ్రద్ధాంజలి’, ‘కమాండో’, ‘లోటస్ ఫార్మేషన్’, ‘హ్యూమన్ పిరమిడ్’ వంటి విన్యాసాలు ఆహూతులందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ‘డేర్ డెవిల్స్’ మోటార్ సైకిల్ బృందం గతంలోనూ ఎన్నో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. గత ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమక్షంలో బిఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)కు చెందిన ‘జాన్‌బాజ్’ బృందం అనేక విన్యాసాలతో అందరినీ కట్టిపడేసింది.
chitram..

మోటార్ సైకిళ్లపై అద్భుత విన్యాసాలు ప్రదర్శిస్తున్న ‘డేర్ డెవిల్స్’

సైనిక పాటవం.. సాంస్కృతిక వైభవం

న్యూఢిల్లీ, జనవరి 26: అరవై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజ్‌పథ్‌లో జరిగిన పరేడ్ మన సైనికశక్తితో పాటుగా దేశంలోని భిన్న సంస్కృతులు, వివిధ రంగాల్లో మన దేశం సాధించిన విజయాలకు అద్దంపట్టే విధంగా రూపొందించిన శకటాలు సందర్శకులను కట్టి పడేశాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఉదయానికి పరేడ్ జరిగే రాజ్‌పథ్‌కు చేరుకుని ఇరువైపులా ఆసీనులైన వేలాది మంది ఒక్కో శకటం తమను దాటుకుని వెళ్తూ ఉండే హర్షధ్వానాలు చేశారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, మారీ గోల్డ్ ‘సఫా’ (టర్బన్) ధరించి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీలకు మధ్యలో ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాన్ ఆసీనులయ్యారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన పరేడ్‌లో అనేక సందర్భాల్లో ప్రధాని మోదీ పరేడ్‌లో పాల్గొన్న వాటి గురించి హోలాన్‌కు వివరించడం కనిపించింది. ప్రతిసారీ రెండు గంటలకు పైగా సాగే పరేడ్‌ను ఈ ఏడాది భద్రతా కారణాల దృష్ట్యా 90 నిమిషాలకు కుదించారు. ఈ ఏడాది మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ సైన్యానికి చెందిన దశం కూడా పరేడ్‌లో పాల్గొనడం విశేషం. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక విదేశీ సైనిక దశం పాల్గొనడం ఇదే మొదటిసారి. 2009లో ప్రతి ఏటా జరిగే ఫ్రాన్స్ బాస్టిల్లీ డే పరేడ్‌లో మన సైన్యానికి చెందిన బృందం కూడా పాల్గొంది. క్షిపణులను సైతం ప్రయోగించగల సామర్థ్యం కలిగిన టి-90 యుద్ధ ట్యాంక్ భీష్మ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ మూబైల్ అటానమస్ లాంచర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ. స్మేర్చ్ లాంచర్ వెహికిల్స్ లాంటి మన సైనిక పాటవానికి ప్రతిరూపాలు పరేడ్‌లో ప్రదర్శితమైనాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైనుంచి సర్వ సైన్యాధ్యక్షుడు కూడా అయిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సైనిక, పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సారి రిపబ్లిక్ పరేడ్‌లో తొలిసారి పోలీసు జాగిలాల దళం కూడా పాలు పంచుకోవడం విశేషం.
అంతకు ముందు రాష్టప్రతితో కలిసి వచ్చిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికి త్రివిధ దళాధిపతులను పరిచయం చేశారు. ఉపరాష్టప్రతి హమిద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతోపాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆర్మీ అధికారులు, దౌత్య ప్రతినిధులు ఈ పరేడ్‌ను తిలకించారు. పరేడ్ ప్రారంభం కావడానికి ముందు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాధిపతులు అమరజవాన్ జ్యోతివద్ద పుష్పగుచ్ఛాలుంచి అమర జవాన్లకు నివాళులర్పించారు. అలాగే పరేడ్ ప్రారంభానికి ముందు రాష్టప్రతి ప్రణబ్ గత ఏడాది సెప్టెంబర్‌లో జమ్మూ, కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హప్రుదా అడవుల్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అసువులు మాసిన 9 పారా (ప్రత్యేక దళం)కు చెందిన లాన్స్‌నాయక్ మోహన్ నాథ్ గోస్వామికి మరణానంతరం అత్యున్నత సైనిక పురస్కారమైన అశోక్ చక్రను ప్రదానం చేశారు. గోస్వామి సతీమణి భావనా గోస్వామి ఈ అవార్డును అందుకున్నారు.