జాతీయ వార్తలు

అదనంగా 17 బెటాలియన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: జమ్ముకాశ్మీర్ సహా నక్సల్ సమస్య తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో కొత్తగా 17 ప్రత్యేక పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశాలోని నక్సల్ పీడిత ప్రాంతాల్లో ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అదనంగా 17వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలుంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 17 బెటాలియన్లలో ఐదు బెటాలియన్లు కాశ్మీర్‌లో, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశాల్లో మూడేసి చొప్పున, మహారాష్టల్రో రెండింటిని ఏర్పాటు చేస్తారు.
స్థానిక యువతకు ఉపాధిని కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది. 1971లో మొదటిసారిగా రిజర్వ్ బెటాలియన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 153 బెటాలియన్లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమైతే ఇప్పటి వరకూ 144 ప్రత్యేక రిజర్వ్ దళాలను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, అలాగే నక్సల్ సమస్యను ఎదుర్కోవడంలో ఈ ప్రత్యేక దళాలు స్థానిక పోలీసులకు సహకరిస్తాయి. ఒక్కో దళంలో వెయ్యిమంది పోలీసులు ఉంటారు.
ఎన్‌డిఎఫ్‌డిసి నిధులు 1200 కోట్లు
ఇదిలా ఉండగా, జాతీయ షెడ్యూల్డు కులాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి) నిధులను కేంద్ర మంత్రివర్గం వెయ్యి కోట్ల రూపాయల నుంచి 1200కోట్ల రూపాయలకు పెంచింది. షెడ్యూల్డు కులాలు, తెగలకు ఉద్దేశించిన పథకాలను మరింత విస్తృతంగా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.