జాతీయ వార్తలు

తొందరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు నోటీసులు జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభంపై జారీ చేసిన తన నోటీసులో ఈ నెల 29వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, గవర్నర్ ఆదేశించింది.
ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఒకటో తేదీకి వాయిదా వేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రాతి పాలన విధింపునకు ఏం తొందర వచ్చిందంటూ న్యాయమూర్తి జె.ఎస్.ఖేహార్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. రాష్టప్రతి పాలన విధించాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించటానికి ఆధారమైన ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవా పంపించిన నివేదికను 15 నిమిషాలలోగా న్యాయస్థానానికి సమర్పించాలని అంతకు ముందు ధర్మాసనం ఆదేశించింది. రాష్టప్రతి పాలన విధిస్తూ రాష్టప్రతి జారీ చేసిన నోటిఫికేషన్‌ను తాజా పిటిషన్‌లో సవాలు చేయలేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి లేవనెత్తిన అభ్యంతరాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఈ అంశం చాలా తీవ్రమైనద’ని, ఇందులో ‘సాంకేతిక అభ్యంతరాలు’ లేవనెత్తకూడదని అత్యున్నత న్యాయస్థానం హితవు పలికింది. ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ విప్ రాజేశ్ టాకో సహా ఆ పార్టీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ గవర్నర్‌కు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారంలోగా తమ పిటిషన్లను సవరించుకోవడానికి పిటిషనర్లకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గవర్నర్ నివేదికను, సిఫారసును రహస్యంగా ఉంచాలని ఆయన తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ సత్పాల్ జైన్ కోరగా, ఆ నివేదికను మూసి ఉంచిన కవర్‌లో పెట్టి ఇవ్వాలని ధర్మాసనం సూచించింది.