జాతీయ వార్తలు

పాలనా పగ్గాలు చేపట్టిన అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, జనవరి 27: అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్రం రాష్టప్రతి పాలన విధించిన తర్వాత రాష్ట్ర గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవా పరిపాలనా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా శాసనసభ్యులకు వారికి దక్కాల్సిన భద్రతను కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం గవర్నర్ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేకుండా చూడాలని వారికి సలహా ఇచ్చారు. చట్టాలను తు.చ తప్పకుండా పాటించాలని, సామాన్య ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ నేగి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులకు గవర్నర్ సూచించారు. మాజీ ముఖ్యమంత్రి, మంత్రులకు సెక్యూరిటీని కల్పించడం గురించి మాట్లాడుతూ, ఈ విషయంలో ఎలాంటి సమస్యా ఉండదని, రాష్ట్ర అసెంబ్లీలోని ప్రతి సభ్యుడికి వారికి దక్కాల్సిన భద్రత కల్పించడం జరుగుతుందని రాజ్‌ఖోవా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష బిజెపి, స్వతంత్ర ఎమ్మెల్యేలతో చేతులు కలిపి పోటీ అసెంబ్లీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి నబమ్ తుకిని గద్దె దించడంతో పాటుగా అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియాను అభిశంసిస్తూ తీర్మానం చేయడానికి దారితీసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కేంద్రం ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ వైఎస్ దద్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎస్ పట్నాయక్‌లను గవర్నర్‌కు సలహాదార్లుగా నియమించింది. కాగా, నిర్ణయాలు తీసుకోవడం, పనుల అమలు విషయంలో పారదర్శకత ఉండేలా చూడాలని, అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ అధికారులను కోరారు. అలాగే అభివృద్ది పనుల అమలులో సహకరించాలని, మత సామరస్యాన్ని పాటించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.