జాతీయ వార్తలు

ఆస్తి పోతుందనే భయంతోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: షీనాబోరా హత్య వెనుక అసలు గుట్టు సిబిఐ బయటపెట్టింది. కన్నకూతురికి ఆస్తి మొత్తం పోతుందనే భయంతోనే మాజీ భర్తతో కలిసి షీనా బోరాను ఇంద్రాణి హత్యచేసిందని సిబిఐ కోర్టుకు తెలిపింది. మూడో భర్త కుమారుడైన రాహుల్‌ను షీనాబోరా వివాహం చేసుకుంటే ఆస్తి మొత్తం వారి పరమైపోతుందని, మొదటి భర్త కుమార్తె విధీకి ఏమీ మిగలదని, దీంతో షీనాబోరాను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారని సిబిఐ చార్జిషీట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించిన ఈ హత్యోదంతంలో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యామ్‌రాయ్ కీలకపాత్ర పోషించారని పేర్కొంది. ఈ కుట్రలో ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియా కూడా పాత్రధారుడని పేర్కొంది. శుక్రవారం ముఖర్జియాను అరెస్టు చేసిన సిబిఐ ఇక్కడి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. షీనాబోరాను హత్య చేసేందుకు ఇంద్రాణితో కలిసి ముఖర్జియా కుట్ర పన్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్‌సింగ్ కోర్టుకు తెలిపారు. షీనా బోరా హత్యానంతరం రాహుల్‌ను తప్పుదోవ పట్టించి వాస్తవాలను దాచిపెట్టారని కోర్టుకు వివరించారు. షీనాబోరా హత్యకు ముందు, జరిగిన రోజు, ఆ తర్వాత ఇంద్రాణితో పీటర్ నిరంతరం సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఇంద్రాణి, షీనాబోరా మధ్య వివాదాలను పరిష్కరించేందుకు పీటర్ ముఖర్జియా మధ్యవర్తిగా వ్యవహరించారని అనిల్‌సింగ్ వివరించారు. రాహుల్, షీనా వివాహం జరిగితే ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని నిందితులు భావించారని, ఈ కోణంలో సిబిఐ విచారణ జరిపిందని ఆయన తెలిపారు. పీటర్ ముఖర్జియాను విచారణ నిమిత్తం 14 రోజులు కస్టడీ విధించాలని సిబిఐ కోర్టును కోరింది. అయితే, ఈ నెల 23 వరకు కస్టడీకి అనుమతించింది.
ముఖర్జియాపై హత్య, కుట్ర అభియోగాలు
షీనాబోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియాను గురువారం అరెస్టు చేసిన సిబిఐ, ఆయనపై హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలు తారుమారు తదితర అభియోగాలను మోపింది. తన భార్య ఇంద్రాణిని రక్షించేందుకు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని పేర్కొంది. షీనా హత్య కేసులో చార్జిషీటు దాఖలు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే పీటర్‌ను సిబిఐ అరెస్టు చేసింది.

ముఖర్జియాను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్
కోర్టులో హజరు పరచడానికి తీసుకెళ్తున్న దృశ్యం