జాతీయ వార్తలు

వీలు కుదర్లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: భారత్-పాక్ మధ్య తలపెట్టిన విదేశాంగ కార్యదర్శుల చర్చల తేదీ ఎండమావిగానే మారుతోంది. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన తేదీ కుదరక పోవడమే ఇందుకు కారణమని చెబుతున్నా..ముంబయి కేసు విచారణే ఉగ్రవాద నిర్మూలనపై పాకిస్తాన్ చిత్తశుద్ధికి నిదర్శనమని భారత్ వ్యాఖ్యానించింది. ‘ఇప్పటి వరకూ ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన తేదీయే కుదరలేదు’అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ఇక్కడ తెలిపారు. భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల గురించి, ఈ చర్చలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశాలపై ఇక్కడ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు వికాస్ స్వరూప్ బదులిస్తూ పై విషయం చెప్పారు. పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదుల దాడికి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్న దర్యాప్తులో పురోగతి గురించి అడగ్గా, ఈ అంశంపై ఇరు దేశాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయని బదులిచ్చారు. అయితే ఇంతకుమించి వివరించడానికి ఆయన నిరాకరించారు. ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలను ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు చూసుకోవాలని నిర్ణయించినప్పటికీ, విదేశాంగ మంత్రులు బేటీ అయినప్పుడు పఠాన్‌కోట్‌పై ఉగ్రవాద దాడిని భారత్ లేవనెత్తుతుందనే విషయం స్పష్టమైనదేనని స్వరూప్ అన్నారు. 26/11 దాడి కేసులో దాడి సూత్రధారి జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ, మరో ఆరుగురు నిందితుల స్వర నమూనాలను సేకరించడానికి ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతించని విషయాన్ని తాను మీడియాలో చూశానని స్వరూప్ తెలిపారు. అయితే ఈ విషయమై పాకిస్తాన్ నుంచి అధికార మార్గాల ద్వారా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం భారత్‌కు అందలేదని ఆయన వివరించారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్తాన్ చిత్తశుద్ధికి ఈ దర్యాప్తు ఒక పరీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దాడికి ప్రణాళిక, ఉగ్రవాదులకు శిక్షణ, ఆర్థికసాయంలో 99శాతం పాకిస్తాన్‌లోనే జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందువల్ల దాడి సూత్రధారులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి అవసరమైన ఆధారాలను సేకరించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీదే ఉందని ఆయన అన్నారు.