జాతీయ వార్తలు

విశాఖ, కాకినాడ ఇక స్మార్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ సిటీస్ ఇవే!
భువనేశ్వర్, పుణె, జైపూర్, సూరత్, కొచ్చి, అహమదాబాద్,
జబల్‌పూర్,
విశాఖపట్నం,
షోలాపూర్, దావణగెరె, ఇండోర్, ఢిల్లీ, ఎన్‌డిఎంసి, కోయంబత్తూరు,
కాకినాడ, బెల్గాం,
ఉదయపూర్, గౌహతీ, చెన్నై, లూథియానా, భోపాల్

న్యూఢిల్లీ, జనవరి 28: స్మార్ట్ సిటీల ఎంపికకు కేంద్రం నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధిస్తే తెలంగాణా రాష్ట్రం ఫెయిల్ అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, కాకినాడ ఎంపిక కాగా తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా ఎంపిక కాలేదు. తమ శాఖకు చెందిన నిపుణుల కమిటీ ఈ ఎంపిక చేసింది తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయన గురువారం విలేఖరుల సమావేశంలో ఇరవై స్మార్ట్ నగరాల పేర్లు ప్రకటించారు. భోపాల్ తరువాత స్థానం వరంగల్‌కు వచ్చినా మొదటి దశలో ఎంపికయ్యేందుకు అవసరమైన పాయింట్లు సాధించటంలో విఫలమైందన్నారు. వరంగల్ ఒక పాయింట్ తేడాతో స్మార్ట్ సిటీ ఎంపికలో ఓడిపోయిందన్నారు. స్మార్ట్ సిటీలుగా ఎంపిక కావడంలో విఫలమైన నగరాల కోసం ఏప్రిల్‌లో సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఏప్రిల్ 15లోగా ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఇరవై స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం దాదాపు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆయన చెప్పారు. దీనికి అదనంగా ప్రైవేట్ సంస్థలు, విదేశాలు కూడా ఈ నగరాల అభివృద్ధికి పెట్టుబడులు పెడతాయని ఆయన తెలిపారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నగరాలు మొదటి దశలో స్మార్ట్ సిటీలుగా ఎంపిక కాకపోవటానికి ఆయా రాష్ట్రాలే కారణమన్నారు. సమర్థ ప్రతిపాదనలు పంపించకపోవటం వల్లనే ఈ రాష్ట్రాలకు చెందిన నగరాలు ఎంపిక కాలేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు చెందిన నిపుణుల కమిటీ తయారు చేసిన తొంబై మూడు నగరాల జాబితాలో తెలంగాణాకు చెందిన వరంగల్ 23వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నగరం తిరుపతి నలభై రెండవ స్థానంలో ఉన్నది. ఎనిమిదవ స్థానంలో ఉన్న విశాఖపట్నం, పద్నాల్గవ స్థానంలో ఉన్న కాకినాడ మొదటి జాబితాలో స్థానం సంపాదించాయి. ఇరవై నగరాల్లో నుండి ఇరవై ఏడు వేల ఎకరాల ప్రాంతాన్ని స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేస్తారని వెంకయ్యనాయుడు చెప్పారు. మొదటి దశలో ఐదు రాష్ట్రాల రాజధానులను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారని వెంకయ్యనాయుడు తెలిపారు.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రెండో దశలో మరో 23 నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేస్తామన్నారు. దాని తరువాత మిగతా 24 నగరాల ఎంపిక పోటీ జరుగుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు. ఒక నగరంలోని పరిమిత ప్రాంతాన్ని స్మార్ట్‌గా అభివృద్ది చేసినంత మాత్రాన మొత్తం నగరం స్మార్ట్ ఎలా అవుతుందనే ప్రశ్నకు కేంద్ర మంత్రినుంచి సరైన సమాధానం రాలేదు. మొదట ఎంపిక చేసిన ఇరవై నగరాలు ఎప్పటిలోగా స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చెందుతాయి, దీనికో కాల పరిమితి ఉన్నదా? అని ఒక విలేఖరి అడుగగా అలాంటిదేదీ లేదని వెంకయ్యనాయుడు తెలిపారు.