జాతీయ వార్తలు

తప్పు రాజీవ్‌దే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడమే కాక మరెన్నో పదవులు నిర్వహించిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తన అనుభవాలకు అక్షర రూపం కల్పించారు. అయోధ్య వివాదం మొదలుకొని తాను ప్రధాని కావాలని అనుకున్నట్లు వచ్చిన దుష్ప్రచారం దాకా ఎన్నో అంశాలపై తన మనసులోని మాటను ఆయన తన తాజా పుస్తకంలో తెలియజేశారు. అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి స్థలాన్ని 1986 ఫిబ్రవరి 1న పూజా కార్యక్రమాల కోసం తెరవడం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్న తప్పుడు నిర్ణయమని, బాబ్రీ మసీదు కూల్చివేత నమ్మకద్రోహమని, ప్రపంచం దృష్టిలో భారత ప్రతిష్ఠను దిగజార్చిందని ప్రణబ్ ఆ ఆత్మకథలో పేర్కొన్నారు. ‘ది టర్బులెంట్ ఇయర్స్: 1980-96’ పేరుతో ఉన్న ఈ పుస్తకాన్ని ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ గురువారం ఆవిష్కరించారు. ‘ 1986 ఫిబ్రవరి 1న రామజన్మభూమి స్థలాన్ని భక్తుల దర్శనకోసం తెరవడం మరో తప్పుడు నిర్ణయం. ఇలాంటి చర్యలను తీసుకోకుండా ఉండి ఉంటే బాగుండేదని జనం భావించారు. అలాగే బామ్రీ మసీదుకట్టడం కూల్చివేత పూర్తిగా నమ్మక ద్రోహం. ఓ మతి లేని చర్యే. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకోసం చేసిన పని. ఇది దేశంలో, విదేశాల్లోని ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమే కాకుండా భిన్న సంస్కృతులకు నిలయంగా, అందరినీ అంగీకరించే దేశంగా భారత్‌కున్న పేరుప్రతిష్ఠలను అది దెబ్బతీసింది’ అని ప్రణబ్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం సమాజంలో సామాజిక అన్యాయం తగ్గడానికి తోడ్పడిందని, అయితే అది సమాజంలో వివిధ కులాల వారు చీలిపోవడానికి సైతం అది కారణమైందని ఆయన అభిప్రాయ పడ్డారు. 1989-91 మధ్య కాలంలో హింస, భారతీయ సమాజంలో తీవ్రమైన విభేదాలకు కారణమైందని ప్రణబ్ అన్నారు. ‘జమ్మూ, కాశ్మీర్‌లో తీవ్రవాదం, సీమాంత ఉగ్రవాదం తిరిగి తలెత్తాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం దేశాన్ని కుదిపేసింది. చివరికి 1991 మే 21న మానవ బాంబు కారణంగా రాజీవ్ గాంధీ జీవితం అర్ధంతరంగా ముగియడానికి దారి తీసింది’ అని ఆయన అన్నారు.
ఇందిరాగాంధీ హత్య అనంతరం తాను తాత్కాలిక ప్రధాని కావాలని ఎప్పుడూ కోరుకోలేదని, దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలన్నీ శుద్ధ తప్పని ఆయన అన్నారు. నేను తాత్కాలిక ప్రధాని కావాలని అనుకున్నానని, దానికోసం ప్రయత్నాలు చేశానని, అయితే అందరూ కలిసి వేరే విధంగా ఒప్పించారని అప్పట్లో బోలెడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇవి రాజీవ్ గాంధీ మనసులో అపార్థాలను సృష్టించాయి. అయితే ఇవి పూర్తిగా తప్పుడు కథనాలు’ అని ప్రణబ్ అన్నారు. అలాగే ఇందిరాగాంధీ మరణానంతరం ప్రధాని పదవికి సంబంధించి ఒక బాత్‌రూమ్‌లో తాను రాజీవ్ గాంధీతో జరిపిన సంభాషణ గురించి కూడా ప్రణబ్ ఆ పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు. అలాగే తనను రాజీవ్ గాంధీ కేంద్ర మంత్రిపదవినుంచి, ఆ తర్వాత పార్టీనుంచి తప్పించడానికి దారి తీసిన పరిస్థితులను సైతం ఆయన పుస్తకంలో వివరిస్తూ, ఈ విషయంలో రాజీవ్, తాను ఇద్దరూ కూడా తప్పు చేశామని అభిప్రాయ పడ్డారు. రాష్టప్రతి విధింపు నిబంధన దుర్వినియోగానికి కారణమయ్యే అవకాశముందని ప్రణబ్ అంటూ, అయితే ఇనే్నళ్ల సమయంలో నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆ అవకాశం చాలావరకు తగ్గిపోయిందని ప్రణబ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

చిత్రం... రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకాన్ని
గురువారం ఢిల్లీలో ఆవిష్కరించిన ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ