జాతీయ వార్తలు

మన శ్రీమంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ప్రపంచంలోని అత్యంత సంపన్నులయిన 50 మందిలో ముగ్గురు భారతీయులు- ముకేశ్ అంబానీ, అజీం ప్రేమ్‌జీ, దిలీప్ శాంఘ్వీ నిలిచారు. అమెరికాకు చెందిన ఐటి దిగ్గజం బిల్‌గేట్స్ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. బిజినెస్ ఇన్‌సైడర్‌తో కలిసి వెల్త్-ఎక్స్ రూపొందించిన ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 24.8 బిలియన్ డాలర్ల ఆస్తులతో ముకేశ్ అంబానీ 27వ స్థానంలో నిలిచారు. అజీం ప్రేమ్‌జీ 16.5 బిలియన్ డాలర్ల ఆస్తులతో 43వ స్థానంలో, దిలీప్ శాంఘ్వీ 16.4 డాలర్ల ఆస్తులతో 44వ స్థానంలో నిలిచారు.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులయిన 50 మంది మొత్తం ఆస్తులు 1.45 ట్రిలియన్ డాలర్లు. ఈ మొత్తం దాదాపు ఆస్ట్రేలియా స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)తో సమానమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో బిల్ గేట్స్ 87.4 బిలియన్ డాలర్ల ఆస్తులతో అగ్రస్థానంలో నిలువగా, స్పెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త అమన్‌సియో ఓర్టెగా గవోనా 66.8 బిలియన్ డాలర్ల ఆస్తులతో రెండో స్థానంలో, వారెన్ బఫెట్ 60.7 బిలియన్ డాలర్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. అమెజాన్ అధినేత జెఫ్రీ బెజోస్ 56.6 బిలియన్ డాలర్ల ఆస్తులతో, అమెరికా బిజినెస్ టైకూన్ డేవిడ్ కోచ్ 47.4 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలోని అయిదుగురు అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అత్యంత సంపన్నులయిన 50 మందిలో దేశాలవారిగా చూస్తే అమెరికా అగ్రస్థానంలో ఉంది. అమెరికానుంచి 29 మంది బిలియనీర్లు ఈ జాబితాలో చోటు సంపాదించగా, చైనా నుంచి కేవలం నలుగురు బిలియనీర్లు, భారత్ నుంచి ముగ్గురు బిలియనీర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్ అతిపిన్న వయస్కుడిగా నిలిచారు. 31 ఏళ్ల జుకర్‌బెర్గ్ 42.8 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో కేవలం నలుగురు మహిళా బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. అత్యంత పెద్ద వయస్కురాలిగా 93 ఏళ్ల ఎల్ ఓరియల్ హెయిరెస్ లిలియానే బెటెన్‌కోర్ట్ నిలిచారు. బెటెన్‌కోర్ట్ 29 బిలియన్ డాలర్ల ఆస్తులతో 17వ స్థానాన్ని ఆక్రమించారు. రంగాలవారీగా చూసినప్పుడు టెక్నాలజీ రంగం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ రంగం నుంచి 12 మంది బిలియనీర్లు జాబితాలో చోటు సంపాదించారు. మరే రంగం నుంచి ఇంత ఎక్కువ మంది చోటు దక్కించుకోలేకపోయారు.