జాతీయ వార్తలు

మళ్లీ పిటిషన్ వేసిన అరుణాచల్ మాజీ సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనను విధించడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకి తాజాగా గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జె.ఎస్.ఖేహార్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్‌విప్ రాజేశ్ టాకో తదితరులు దాఖలు చేసిన పిటిషన్లతోపాటు ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారిస్తుంది. రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను విధించడాన్ని సవాలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి బుధవారం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎజి అభ్యంతరాన్ని తోసిపుచ్చిన ధర్మాసనం శుక్రవారంలోగా పిటిషన్లను సవరించి దాఖలు చేయడానికి పిటిషనర్లకు అనుమతిచ్చింది. దీంతో నబమ్ టుకి సవరించిన పిటిషన్‌ను గురువారం దాఖలు చేశారు. టుకి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను విధించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన తరువాత రాష్టప్రతి పాలన అమలులోకి వచ్చింది.
రాష్టప్రతి పాలన విధించడమనేది చాలా తీవ్రమైన అంశమని, అందువల్ల సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తకూడదని ధర్మాసనం బుధవారం ఎజికి హితవు పలికింది. తరువాత ఈ కేసు విచారణను ఫిబ్రవరి ఒకటో తేదీకి వాయిదా వేసింది. ఫిబ్రవరి ఒకటో తేదీలోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశిస్తూ ధర్మాసనం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవాకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఎం.బి.లోకుర్, పి.సి.ఘోస్, ఎన్.వి.రమణ సభ్యులుగా ఉన్నారు.