జాతీయ వార్తలు

ప్రధాని ట్విట్టర్‌లో లాలా చేతిరాత పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, ‘పంజాబ్ కేసరి’ లాలా లజపతిరాయ్ 150వ జయంతి సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ‘లజపతి రాయ్ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఎంతో దూరదృష్టి కలిగినవారు. ఆయన దేశభక్తి, ఆలోచనలు ఎందరికో స్ఫూర్తిదాయకం’ అని మోదీ తన ట్వీట్‌లో అన్నారు. అంతేకాదు లాలా లజపతి రాయ్ చేతిరాతతో ఉన్న కొన్ని పత్రాలను సైతం ప్రధాని ట్విట్టర్‌లో ఉంచారు. ‘పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్‌కి చెందిన ఈ చేతిరాత పత్రాలు మీకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి’ అని ఆ పత్రాలను ట్విట్టర్‌లో ఉంచుతూ ప్రధాని అన్నారు.
chitram...
లాలా లజపతిరాయ్ జయంతి
సందర్భంగా పార్లమెంట్ హ స్‌లోని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అద్వానీ, కురియన్, రాజ్‌నాథ్, వెంకయ్య నాయుడు, ఆజాద్