జాతీయ వార్తలు

వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, జనవరి 28: దేశంలో సామాజిక వివక్ష ఉన్నంతవరకు రిజర్వేషన్ల విధానం కొనసాగవలసిందేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘సామాజిక వివక్ష ఉన్నంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. అయితే దాన్ని నిజాయితీగా అమలు చేయాలి’ అని గురువారం ఇక్కడ మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) ఏర్పాటు చేసిన ‘స్టూడెంట్స్ పార్లమెంటు’ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా భగవత్ చెప్పారు. ఈ దేశ రాజ్యాంగంతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధానాన్ని నిజాయితీగా అమలు చేయాలన్నారు. అంతేకాదు రాజ్యాంగంలో పేర్కొన్న పౌరుల విధులను కూడా పాటించాలని చెప్పారు.
కాగా, శ్రీరాముడ్ని హిందూ సంస్కృతికి ప్రతిరూపంగా భగవత్ అభివర్ణిస్తూ, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని అభిప్రాయపడ్డారు. అయోధ్యలో రామందిరం నిర్మిస్తే దేశంలో ప్రజలకు తిండి దొరకుతుందా? అని ప్రశ్నించగా, ‘మందిరం ఇప్పటివరకు నిర్మించబడలేదు అయితే వారికి రోటీలు దొరుకుతున్నాయా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. దేశంలో అసహనం పెరిగిపోతోందన్న అభిప్రాయాల గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, సహనం, స్వీకరణ అనేవి మన సంస్కృతి ముఖ్యాంశాలని అన్నారు. అంతేకాదు, స్వార్థపూరిత మనోభావాలు తప్పని కూడా ఆయన అన్నారు. మత ఆధారిత రాజకీయాల గురించి ప్రశ్నించగా, ‘ఈ ప్రశ్నను అలాంటివి చేసేవారిని అడగాలి, నన్ను కాదు’ అని భగవత్ అన్నారు. ‘మనం ఏం చెప్తామో దానే్న పాటించాలి, అలాగే మంచిని మాత్రమే స్వీకరించాలి’ అని ఆయన అన్నారు.
భారత రాజ్యాంగానికి సంస్కృతే మూలమని, మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేసుకునే వెసులుబాటు దీనికి ఉందని భగవత్ అన్నారు. ఈ కార్యక్రమంలో భగవత్ ‘సంస్కృతి, రాజ్యాంగం’ అనే అంశంపై మాట్లాడారు. దేశం స్వాతంత్య్రం పొందినప్పుడు భారతదేశం తమ దేశం కాదని భావించిన వారికోసం ఒక కొత్త దేశం ఏర్పడిందని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగం అన్ని కులాలు, మతాల వారిని అంగీకరించడమే కాక ఏకాభిప్రాయంపై ఏర్పడిందయితే పాకిస్తాన్ రాజ్యాంగం మతం, కులం ఆధారంగా ఏర్పడిందన్నారు. పాకిస్తాన్ మనసులో సహనం, స్వీకరణకు చోటు లేదని భగవత్ అంటూ, భారతదేశం భిన్నత్వాన్ని స్వీకరించడమే కాకుండా గౌరవించిందని, దేశ ఐక్యతకు అదే మూలకారణమని అన్నారు. ‘్భన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి, సనాతన ధర్మం’ అని ఆయన చెప్పారు.