జాతీయ వార్తలు

ఎన్‌ఐఏ కస్టడీకి మహ్మద్ రఫీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 29: బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ పేలుళ్ల కేసు దర్యాప్తులో ఎట్టకేలకు దర్యాప్తు అధికారులు పురోగతి సాధించారు. పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన మొహమ్మద్ రఫీక్ అలియాస్ జావీద్ అలియాస్ ఆలం జెబ్ అఫ్రిదీని జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన రఫీక్‌ను అనంతరం దర్యాప్తు అధికారులు ఇక్కడి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా, కోర్టు అతనిని పది రోజులపాటు ఎన్‌ఐఎ కస్టడీకి అప్పగించింది. దాడి సూత్రధారి ఆదేశాల మేరకు రఫీక్ బెంగళూరు నగరంలోని కోకోనట్ గ్రోవ్ బార్ అండ్ రెస్టారెంట్‌లోపల శక్తివంతమైన బాంబును అమర్చాలని అనుకున్నాడని ఎన్‌ఐఎ తెలిపింది. 2014 డిసెంబర్ 28న ఇజ్రాయెల్‌కు చెందిన ఒక ప్రతినిధి బృందం ఈ రెస్టారెంట్‌కు వచ్చే అవకాశం ఉందని రఫీక్‌కు సూత్రధారి చెప్పినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. అయితే రాత్రివేళ రెస్టారెంట్ ముందు భాగంలో ఈ బాంబు పేలడం వల్ల ఒక మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కేరళలోని వాఘమన్‌లో సిమి నిర్వహించిన ఉగ్రవాద శిక్షణ శిబిరం కేసులోనూ రఫీక్ నిందితుడని ఎన్‌ఐఎ వెల్లడించింది. అయిదేళ్ల నుంచి పరారీలో ఉన్న రఫీక్ తలపై రూ. మూడు లక్షల రివార్డు ఉందని వివరించింది. రఫీక్‌ను పట్టుకునేందుకు అవసరమైన సమాచారం ఇచ్చిన వారికి రూ. 3లక్షలు ఇస్తామని తాము గతంలో ప్రకటించినట్లు ఎన్‌ఐఎ ఒక ప్రకటనలో తెలిపింది. రఫీక్ మూడేళ్ల పాటు బెంగళూరు నగర శివార్లలో నివసించాడని, ఎయిర్‌కండీషనర్స్ మెకానిక్‌గా పనిచేశాడని ఎన్‌ఐఎ వివరించింది. చర్చ్ స్ట్రీట్ పేలుళ్లలో తన ప్రమేయం ఉందని రఫీక్ విచారణలో ఒప్పుకున్నాడని తెలిపింది. తొలుత పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో తరువాత కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఎకి అప్పగించారు.