జాతీయ వార్తలు

జుహూ బీచ్‌కి కొట్టుకొచ్చిన 36 అడుగుల భారీ తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 29: దాదాపు 36 అడుగుల పొడవుండే బ్రిడే జాతికి చెందిన భారీ తిమింగలం ఒకటి ముంబయి సమీపంలోని జుహూ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకు రావడంతో ఈ భారీ ప్రాణిని చూడడానికి జనం పెద్ద సంఖ్యలో బీచ్‌కి చేరుకున్నారు. దాదాపు 20 టన్నుల బరువు, 11.3 మీటర్ల పొడవుండే ఈ తిమింగలం గురువారం రాత్రి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. శుక్రవారం దాన్ని బీచ్‌లోనే పూడ్చిపెట్టినట్లు అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ ఎన్ వాసుదేవన్ చెప్పారు.
బ్రిడే జాతి తిమింగలం అంతరించి పోతున్న జాతుల్లో ఒకటని, అరేబియా సముద్రంలో మాత్రమే ఇవి కనిపిస్తాయని ఆయన చెప్పారు. ఈ తిమింగలం మృతికి కారణాలను నిర్ధారించలేక పోయామని, బహుశా సముద్రంలోనే చనిపోయి ఒడ్డుకు కొట్టుకొని వచ్చి ఉండవచ్చని తెలిపారు. తిమింగలం వంటిపైన ఎక్కడా ఎలాంటి గాయాలు లేవని ఆయన తెలిపారు. నిన్న రాత్రి తిమింగలాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడులోని తిరుచెందూర్ బీచ్‌కి ఇటీవల 30 బలీన్ తిమింగాల మృత దేహాలు కొట్టుకు రావడం తెలిసిందే.
chitram...
గురువారం రాత్రి ముంబయ జుహూ బీచ్‌కు
కొట్టుకు వచ్చిన తిమింగలాన్ని క్రేన్ సహాయంతో తరలిస్తున్న దృశ్యం