జాతీయ వార్తలు

జికా వైరస్‌పై భారత్ అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రమాదకరమైన జికా వైరస్ భారత్‌కు వ్యాపించే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒక టెక్నికల్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. జికా వైరస్‌ను ఆదిలోనే కనిపెట్టే నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడంపైనా ఈ సాంకేతిక బృందం దృష్టి పెడుతుంది. జికా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, భారత్ వంటి దేశాలకు ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) హెచ్చరించిన మరుసటి రోజే కేంద్రం అప్రమత్తమై ఈ చర్య తీసుకుంది. ఇటీవల కొన్ని దేశాలలో జికా వైరస్ సోకిన కేసులు బయటపడిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. జికా వైరస్ వ్యాపించినా ఎదుర్కోవడానికి భారత్ సంసిద్ధంగా ఉందని మంత్రి నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఒకవేళ వైరస్ వ్యాపించినా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని సమావేశానంతరం మంత్రి నడ్డా తెలిపారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) వైద్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ జికా వైరస్ అమెరికాస్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకితే చిన్న పిల్లల్లో మెదడు దెబ్బతింటుంది. డెంగ్యూ, చికున్‌గున్యాకు కారణమైన వైరస్‌ను కూడా ఈ దోమ మోసుకెళ్లగలుగుతుంది. గత సంవత్సరం బ్రెజిల్‌లో ప్రబలిన ఈ జికా వైరస్ ఇప్పటి వరకు అమెరికాస్‌లోని 24 దేశాలకు వ్యాపించింది.

అరుణాచల్‌లో అరాచకం
గవర్నర్‌కే భద్రత లేదు కుమ్మక్కయిన సిఎం, స్పీకర్
రాష్టప్రతి పాలన సహేతుకం సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

న్యూఢిల్లీ, జనవరి 29: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గట్టిగా సమర్థించుకుంది. రాష్ట్రంలో పాలనా వ్యవస్థ స్తంభించిపోయిందని, గవర్నర్, ఆయన కుటుంబ సభ్యులకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి తలెత్తిందంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవాకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నబం తుకి,స్పీకర్ నబం రెబియాలు కుల రాజకీయాలు సాగిస్తున్నారని తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితిని వివరిస్తూ..కేంద్ర పాలన విధించాలని గవర్నర్ సిఫార్సు చేయడమే ఇందుకు కారణమని తెలిపింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్‌లు ఓ ప్రత్యేక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని..గవర్నర్ అసోం మూలాలనూ వెలుగులోకి తెస్తున్నారని తన అఫిడవిట్‌లో హోం శాఖ తెలిపింది.
ముఖ్యమంత్రి, స్పీకర్‌ల మద్దతుదారులు కొన్ని గంటల పాటు రాజ్‌భవన్ ప్రాంగణాన్ని దిగ్బంధం చేశారని, ఇందుకు సంబంధించి ఒక్క అరెస్టు కూడా జరుగలేదని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లో రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయిందని చెప్పడానికి అనేక బలమైన కారణాలను ఉదహరించింది. ప్రజాప్రాముఖ్యం కలిగిన అనేక అంశాలపై గవర్నర్ రాసిన లేఖలను, నివేదనలను ముఖ్యమంత్రి అసలు పట్టించుకోనే లేదని, ఆ విధంగా రాజ్యాగంలోని 167(బి) అధికరణను ఉల్లంఘించారని తెలిపింది. అసలు రాష్ట్రంలో బలమైన పాలనా వ్యవస్థే లేదని, రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వమే పనిచేయడం లేదని కేంద్ర హోం శాఖ ఈ అఫిడవిట్‌లో వివరించింది.