జాతీయ వార్తలు

అడవి బిడ్డలకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆటవీ హక్కుల చట్టాన్ని సవరించటం ద్వారా గిరిజనులకు తీరని అన్యాయం చేస్తూ బడా పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ ఆరోపించారు. జైరామ్ శుక్రవారం ఏఐసిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం బ్రిటీష్ కాలానికి చెందిన అటవీ చట్టం ఆధారంగా నియమ, నిబంధనలు ప్రకటించటం, ఆటవీ ప్రాంతాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గ్రామ సభల అనుమతి తీసుకోకుండానే అటవీ భూములను అతర పనులకు మళ్లించేందుకు అనుమతించటం, గిరిజనులు నివసించే ప్రాంతంలో మొక్కలు పెంచటం వంటి చర్యల ద్వారా 2006 అటవీ చట్టాన్ని నీరు కారుస్తోందని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అటవీ చట్టంలో చేస్తున్న మార్పుల వల్ల గిరిజనుల సాధికారిత దెబ్బతింటోందని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. 40 శాతం అటవీ ప్రాంతాన్ని ప్రైవేట్ సంస్థల కోసం కేటాయించాలని నిర్ణయించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. డీ గ్రేడెడ్ అటవీ ప్రాంతాన్ని ప్రైవేట్ కంపెనీలకు కేటాయించాలని నిర్ణయించటం వల్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. ఎన్‌డిఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాన్ని ప్రైవేట్ సంస్థలకు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తా రు. మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కుల గుర్తింపు కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయటం లేదని ఆరోపించారు. అటవీ చట్టంలో పొందుపరిచిన నియమ, నిబంధనలకు విరుద్ధంగా గిరిజనులను రక్షిత ప్రాంతాల నుంచి బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, మధ్యప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లో ఇలా జరుగుతోందని వెల్లడించారు.
రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ఎఫ్‌ఆర్‌ఏ, సిఎఫ్‌ఆర్ హక్కులను అమలు చేయటం లేదని ఆయన విరుచుకుపడ్డారు.