జాతీయ వార్తలు

నాసిక్ ఆలయంలోనూ లింగవివక్షే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్, జనవరి 29: మహారాష్టల్రోని అహ్మద్‌నగర్ శని శింగ్నాపూర్ ఆలయం, ముంబయి హాజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షల కథనాలు కలకలం రేపుతుండగా తాజాగా త్రింబకేశ్వర్ ఆలయం వార్తల్లోకి ఎక్కింది. ప్రసిద్ధ త్రికంబేశ్వర్ ఆలయంలోనూ లింగ వివక్ష కొనసాగుతోంది. ఈ ఆలయం నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో నెలకొంది. దేశంలోని ప్రముఖ శివాలయాల్లో త్రికంబేశ్వర్ దేవాలయం ఒకటిగా వెలుగొందుతోంది. 12 జ్యోతిర్లింగాలతో అలరారుతున్న త్రికంబేశ్వర్ ఆలయంలో లింగవివక్ష కొనసాగడం విమర్శలు వెల్లువెత్తుతుండగా ఆయల ట్రస్టీ దాన్ని సమర్ధించుకుంటోంది. ఇది ఈ వేళ కొత్తగా ప్రవేశపెట్టింది కాదని, పూర్వకాలం నుంచి అమలవుతోందని ట్రస్ట్‌బోర్డ్ సభ్యుడు కైలాశ్ ఘులే స్పష్టం చేశారు. గర్భగుడిలోకి మహిళలను రానీయకపోవడం అన్నది సంప్రదాయంగా వస్తోందని ఇప్పటికిప్పుడు బలవంతంగా పెట్టలేదని ఆయన అన్నారు.
మహిళలు వెలుపల(ప్రధాన ప్రాంతం) నుంచి దర్శనం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఆ దర్శనం కూడా ఉదయం 6-7 గంటల సమయంలో పురుషులు చేసుకోవడంపై ఆంక్షలు ఉన్నాయన్నారు. ఆలయం నియమావళి ప్రకారం శివలింగం ఉన్న ప్రాంతంలో పూజలు చేసుకోడానికి పురుషులను అనుమతించడం ఆనవాయితీగా వస్తున్నదేనని కేలాశ్ ఘులే చెప్పారు. త్రింబకేశ్వర్ ఆలయంలో పూజలు,కర్మకాండల్లో పాల్గొంటున్న సంజయ్ షికారే కూడా ఆంక్షలు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పారు. పీష్వాల కాలం నుంచి ఇదొక ఆచారంగా వస్తోందని సంజయ్ వివరించారు. కుంభమేళ సమయంలోనూ ఎందరో సాధ్వీలు తరలివస్తారని, వారుకూడా గర్భగృహ వెలువల నుంచి పూజలు చేసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. మహిళా భక్తులు ఎప్పుడూ ఆలయ ఆచార వ్యవహారాలను ప్రశ్నించలేదని పలువురు పురోహితులు పేర్కొన్నారు.
గుడికే రానక్కర్లేదు...
భోపాల్: దేశంలోని కొన్ని ఆలయాల్లో లింగవివక్షపై రాద్ధాంతం జరుగుతుండగా, మధ్యప్రదేశ్ హోమ్‌మంత్రి బాబూలాల్ గౌర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. మహారాష్ట్రంలోని శని శింగ్నాపూర్ ఆలయ ప్రవేశంపై మహిళాభక్తులకు ఆంక్షల విధింపుపై స్పందించిన మంత్రి‘మహిళలు గుడికే రానక్కర్లేదు. ఇంటి వద్ద ఉండి కూడా పూజలు చేసుకోవచ్చు’అని వ్యాఖ్యానించారు.శింగ్నాపూర్ ఆలయ ప్రవేశంపై శుక్రవారం ఆయన మాట్లాడుతూ‘ఆ విషయాన్ని అక్కడితో వదిలేద్దాం.. వాళ్లు(మహిళలు) ఇళ్లవద్ద కూర్చుని పూజలు చేసుకున్నా సరిపోతుంది. గుడికే రానక్కర్లేదు’అని మంత్రి అన్నారు.