జాతీయ వార్తలు

మయన్మార్‌లో సైనిక పాలనకు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపీడా, జనవరి 29: మయన్మార్‌లో సైనిక పాలనకు శుక్రవారంతో శాశ్వతంగా తెరపడింది. సైనిక ప్రతినిధులతో నిండిన పార్లమెంటు చివరి రోజయిన శుక్రవారం నాడు మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకి పాత పార్లమెంటు సభ్యులందరినీ అనినందించారు. ఒకప్పుడు బద్ధ శత్రువులైన ఇరుపక్షాలు కూడా 50 ఏళ్ల పాటు మిలిటరీ ఉక్కుపాదం కింద నలిగిన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొనడానికి దారి తీసిన అధికార మార్పిడిని ముక్తకంఠంతో స్వాగతించారు. శుక్రవారం సిట్టింగ్ ఎంపీల చివరి సమావేశం ముగిసిన తర్వాత సూకి గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీకి మార్గం సుగమం చేసినందుకు తన రాజకీయ ప్రత్యర్థులను అభినందించారు. ప్రస్తుత పార్లమెంటు అయిదేళ్ల కాలపరిమితి శుక్రవారంతో ముగిసింది. దీనితో మయన్మార్ రాజకీయ స్వరూపం సమూలంగా మారిపోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊపు లభించడమే కాక సమాజంలో ప్రజలకు మరింత స్వేచ్ఛను సైతం అందించినట్లయింది. ‘మన దేశం, దేశ ప్రజలకోసం మనమంతా పార్లమెంటు లోపల కానీ, బయట కానీ పరస్పరం సహకరించుకోగలమని నేను భావిస్తున్నాను’ అని 15 ఏళ్ల పాటు సైన్యం గృహ నిర్బంధంలో ఉంచిన సూకీ అన్నారు. నేపీడా పార్లమెంటు భవనంలో అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చిన ఓ పార్టీలో సూకీ ప్రసంగించారు. కొత్తగా ఎన్నికయిన సూకీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ(ఎన్‌ఎల్‌డి)కి చెందిన పార్లమెంటు సభ్యులు మొట్టమొదటి సారి సోమవారం పార్లమెంటులో అధికార పార్టీ స్థానాల్లో కూర్చుంటారు.
దశాబ్దాలుగా తమ నీడను సైతం అనుమానించే సైనిక అధికారుల పాలనలో మగ్గిన మయన్మార్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నా భిన్నమైపోయింది.
మరో వైపుఅసమ్మతిని ఉక్కుపాదంతో అణచివేసిన ఫలితంగా మిగతా ప్రపంచంతో దేశానికి సంబంధాలు కూడా లేని పరిస్థితి ఉండింది. అయితే 2011నుంచి అధ్యక్షుడు థీన్ సీన్ చేపట్టిన సంస్కరణల కారణంగా దేశంలో సమూల మార్పులు రావడమే కాక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి విజయం సాధించడానికి దారి తీసింది. యుద్ధాలు, పేదరికం కారణంగా ఛిన్నాభిన్నమైన, ఇప్పటికీ సైన్యం ప్రభావంలోనే ఉన్న దేశాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపించడంలో ఎదురు కానున్న పెను సవాళ్లు ఏమిటో సూకీకి బాగా తెలుసు. అయితే ఒకప్పుడు ఊహించడానికి కూడా వీలు లేని వాతావరణంలో శుక్రవారం అటు పదవినుంచి దిగిపోతున్న ఎంపీలు, ఇటు కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు మొత్తం వెయ్యి మందికి పైగా ప్రజా ప్రతినిధులు విందు తర్వాత ఉత్సాహంగా ఒకరినొకరు సంతోషంగా వీడ్కోలు చెప్పుకోవడం కనిపించింది.
ఎగువ సభ ప్రస్తుత స్పీకర్ ఖిన్ ఆంగ్ మీంట్ పని తీరును సభ్యులంతా అభినందించారు. అంతకు ముందు ఆయన పార్లమెంటు ఉభయ సభల చిట్టచివరి సంయుక్త సమావేశంలో అడుగుడగునా జోక్‌లు వేస్తూ చేసిన ప్రసంగం అందరినీ ఎంతో అలరించింది. అధ్యక్షుడు థీన్ సీన్ గురువారం నాడు దేశ ప్రజాస్వామ్య ప్రగతిని దేశ ప్రజల విజయంగా అభివర్ణించారు. ఎన్‌ఎల్‌డి ఫిబ్రవరి 1నుంచి కొత్త పార్లమెంటును తమ చేతుల్లోకి తీసుకోనుండగా థీన్ మాత్రం వచ్చే మార్చి దాకా అధ్యక్షుడిగా కొనసాగుతారు.