జాతీయ వార్తలు

కారుచౌకగా భూములిచ్చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 29: ప్రముఖ సినీ నటి, బిజెపి ఎంపి హేమమాలినికి అతి తక్కువ ధరకు ప్రభుత్వ భూమిని కేటాయించడంపై వివాదం రాజుకుంది. ముంబాయి లాంటి మహానగరంలో అతి తక్కువ ధరకు భూమిని కట్టబెట్టడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్టీఐ దరఖాస్తుతో కేటాయింపు వ్యవహారం వెలుగుచూడటంతో రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. హేమమాలిని స్థాపించబోయే నాట్యవిహార్ కళా కేంద్రానికి రెండువేల చ.మీ. స్థలాన్ని 70వేల రూపాయలకు కేటాయించింది. చ.మీ కేవలం రూ.35కే కేటాయించడం వివాదాస్పదమైంది. మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి కోట్లాది రూపాయలు విలువ చేస్తుంది. ఆర్టీఐ దరఖాస్తుతో ఈ వివరాలు వెలుగుచూశాయి. అయతే హేమమాలినికి గతంలో కేటాయంచిన భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి పొద్దు పోయన తర్వాత ప్రకటించింది. అంధేరీలో తాజాగా కేటాయంచిన స్థలానికి సంబంధించిన ధరను ఇంకా నిర్ణయంచలేదని వెల్లడించింది. కాగా, హేమమాలినికి భూమిని కేటాయించడాన్ని ఫడ్నవిస్ సర్కార్ సమర్థించుకుంటుండగా, ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. సాంస్కృతిక సంస్థలకు తక్కువ ధరకు భూమిని కేటాయించడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ కేటాయించారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రకాష్ మెహతా సమర్థించుకున్నారు. సాంస్కృతిక రంగానికి మేలు చేకూరే ఈ కళా కేంద్రంలో సాంస్కృతిక, విద్యా సంస్థలను ప్రముఖుల జ్ఞాపకార్థం ఏర్పాటుచేయడం జరుగుతుందని, వారిలో కాంగ్రెస్ నాయకుడు వై.బి.చవాన్ కూడా ఉంటారని తెలిపారు. ప్రభుత్వ భూములను కేటాయించడంలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ హేమమాలిని భూమిని కేటాయించే విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించలేదని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోల్ చవాన్ ఆరోపించారు. కాగా, ఈ వివాదంపై వ్యాఖ్యానించడానికి హేమమాలిని అందుబాటులో లేరు.